twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జల్సా' ఇంటర్వెల్ సీన్ గురించి త్రివిక్రమ్

    By Srikanya
    |

    హైదరాబాద్ :'''జల్సా' సినిమాలో విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశం ఎనిమిది నిమిషాలపాటు సాగుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కాబట్టి కాస్త హంగామా చేయాలి. ఆ సన్నివేశం తీయాలంటే కనీసం ఐదారు రోజులుపడుతుంది. మేం మాత్రం కేవలం 45 నిమిషాల్లో పూర్తి చేశాం'' అన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన తాజా చిత్రం జులాయి విడుదల సందర్భంగా మీడియాని కలిసినప్పుడు..'మీ సినిమాలు బాగా లేటవుతాయనే విమర్శ ఉంది' అంటే ఈ సంఘటన గుర్తు చేసుకున్నారు. 'అలాగే ఒకే సన్నివేశాన్ని నాలుగైదు కెమెరాలతో తీయడం కూడా తప్పు కాదు. నటీనటుల భావోద్వేగాలను మరింత స్పష్టంగా తెరపై ప్రతిబింబించడానికి, సన్నివేశం వేగంగా పూర్తిచేయడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది' అని చెప్పారు.

    'ఇక నేను సినిమాల్ని ఆలస్యంగా తీస్తానని పలువురు అనుకొంటుంటారు. చిన్నచిన్న విషయాలకు రాజీ పడడం నాకు ఇష్టం ఉండదు. స్క్రిప్టు రాసుకొన్నప్పుడే సెట్‌లో ఉండాల్సిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా రాసుకొంటాను. టేబుల్‌పై ఫలానా ఫలానా వస్తువు ఉండాలి అని రాసుకొంటే.. అవన్నీ తప్పకుండా ఉండాల్సిందే. వాటిలో కూడా కథ, పాత్రల స్వభావం ప్రతిబింబిస్తుంటుంది' అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.

    'జులాయి'మాత్రం తక్కువ రోజుల్లో పూర్తి చేశారు. అంటే వేగం పెంచినట్టేనా అని అడిగితే...'ఓ సినిమా తొందరగా పూర్తి అవడానికి, ఆలస్యం అవ్వడానికి చాలా కారణాలుంటాయి. కేవలం నా ఒక్కడితోనే సినిమా నడవదు. కథ రాసుకొన్న తరవాత అందుకు తగిన తారాగణం ఎంపిక జరగాలి. వారి కాల్షీట్లు అందుబాటులో ఉండాలి. లొకేషన్లు దొరకాలి. మధ్యలో ఆటంకాలు ఎదురవ్వకూడదు.. ఇన్ని అంశాలతో ముడిపడి ఉంది. 'జులాయి'కి మాత్రం అన్నీ ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి అందుకే వేగంగా పూర్తైంది' అన్నారు.

    పవన్‌తో 'జల్సా' చేయించిన త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో 'జులాయి' వేషాలు వేయిస్తున్నారు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆయన తరవాత సినిమా ఏమిటి అని అడిగితే...పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి అని చెప్పారు. 'జులాయి'లో అల్లు అర్జున్ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు.

    English summary
    Director,writer Trivikram Srinivas revels that his Jalsa fim intervel is Shoot in 45 mins only. It's lengh is eight mints.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X