»   » నిజమేనా రూమరా..!? మెగా క్యాంప్ నుంచి ఏ సమాచారమూ లేదే

నిజమేనా రూమరా..!? మెగా క్యాంప్ నుంచి ఏ సమాచారమూ లేదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరు హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన చేయబోయే 151, 152 సినిమాలపై కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ 151వ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని, మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.చిరంజీవి 151వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం బోయపాటి శ్రీను దక్కించుకున్నట్లు సమాచారం.

ఇటీవల బన్నీతో 'సరైనోడు' సినిమా తీసిన ఆయన స్టైల్ నచ్చడంతో, గతంలో సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాలు నమోదు చేసిన ఘనత ఉండటంతో మెగాస్టార్ ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి....చిరంజీవి తనదైన స్టల్ లో చూపించి మరో భారీ విజయం నమోదు చేస్తాడని అటు అభిమానులు కూడా నమ్మకంగా ఉన్నారు.

Trivikram To Direct Chiranjeevi's Comeback Film

చిరు-త్రివిక్రమ్ కలయికలో ఎప్పుడో ఓ చిత్రం రావాల్సి ఉంది. చిరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. అయితే, తాజాగా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్రివిక్రమ్ కూడా చిరు కోసం లైన్ రాసుకొన్నాడని.. త్వరలోనే చిరుకి వినిపించనున్నాడని సమాచారమ్. ప్రస్తుతం వినాయక్ తో చేస్తున్నది కమర్షియల్ సినిమా. తర్వత బోయపాటితో మాస్ సినిమా. దీని తర్వాత 152వ సినిమాగా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ చేయాలని అనుకుంటున్నాడట చిరంజీవి.

అంతేకాదు 152వ సినిమాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల చిరంజీవితో త్వరలో సినిమా నిర్మిస్తానంటూ మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రకటించిన నేపథ్యంలో.., అది చిరు 152వ సినిమానే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ రూమర్స్ పై మెగా క్యాంప్ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఖండించకపోవటంతో ఈ న్యూస్ నిజమే అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

English summary
The latest update we hear is that, Trivikram has been finalized to direct the much awaited Chiranjeevi's come back film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu