»   » ఎంత బడ్జెట్‌ కావాలో మీ ఇష్టం : చైతన్య కోసం నాగ్ తాపత్రయం

ఎంత బడ్జెట్‌ కావాలో మీ ఇష్టం : చైతన్య కోసం నాగ్ తాపత్రయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగచైతన్య, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే మాట కొన్ని నెలలుగా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అంతా ఒకే అయినట్లు తెలిసింది. నాగచైతన్యతో త్రివిక్రమ్ మూవీ ఇప్పుడు ఖాయమైందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించినట్లు టాక్. ఇందుకు సంబంధించి త్రివిక్రమ్‌తో నాగ్‌ సంప్రదింపులు కూడా జరిపారట. ఎంత బడ్జెట్‌ కావాలో, ఎన్ని రోజుల్లో తీస్తారో అంతా మీ ఇష్టమని చెప్పారట. ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా తనే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించనున్నాడట. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రారంభించాలని నాగార్జున భావిస్తున్నాడట.

'ప్రేమమ్'తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాగచైతన్య ఇక హీరోగా రేంజ్ ని పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో చైతూ క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముందుగా తివిక్రమ్ డైరెక్షన్ లో అక్కినేని యంగ్ హీరో నటించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా వీరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఫైనల్ గా త్రివిక్రమ్-నాగచైతన్యల సినిమా కన్ ఫర్మ్ అయినట్లు వినికిడి. నాగర్జున ఈ కాంబినేషన్ ని సెట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసినట్లు సమాచారం.

Trivikram, Naga Chaitanya film confirmed

ఈ కాంబినేషన్‌ కానీ సెట్‌ అయితే హీరోయిన్‌గా సమంత నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. చై, సమంతల పెళ్లి నిశ్చయమైన తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు. త్రివిక్రమ్‌ దర్శకత్వానికి తోడు వాళ్లిద్దరూ తెరపై జంటగా కనిపిస్తే క్రేజ్‌ విపరీతంగా వుంటుంది. అయితే ఈ కాంబో పై ఖచ్చితమైన సమాచారమైతే ఇప్పటి వరకూ లేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇరవై కోట్ల మార్కెట్‌ దగ్గరే ఆగిపోయిన చైతన్యని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాలంటే స్టార్‌ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని నాగ్‌ డిసైడయ్యాడట. చైతన్య మార్కెట్‌కి బూస్ట్‌ వచ్చి నెక్స్‌ట్‌ రేంజ్‌కి వెళ్లి సెటిల్‌ అవ్వడానికి స్కోప్‌ పెరుగుతుంది.

English summary
News is that director Trivikram will be directing Naga Chaitanya very soon. Sources tell us that this film has been confirmed. Official announcements will be made Soon
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu