త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్ట్స్ ఫిల్మ్ ఆ హీరోతో కన్ఫర్మ్...
మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ కాంబినేషన్ మరో సారి రిపీట్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తో వెంకటేష్ తో ఓ రొమాంటిక్ కామిడీకి శ్రీకారం చుడుతున్నారు. అయితే ఈ సారి రైటర్ గా కాకుండా దర్శకుడుగా వెంకటేష్ తో పనిచేయనున్నారు. నిర్మాత దానయ్య ఈ కాంబినేషన్ ని సెట్ చేసారు. ఈ సంవత్సరం ఆఖరులో ఈ చిత్రం ప్రారంభం కానుంది. అయితే ప్రారంభమైన ఆరు నెలల లోపే ఈ చిత్రం రిలీజ్ కావాలనే కండీషన్ మీదే త్రివిక్రమ్ కి ఈ చిత్రం ఇచ్చినట్లు చెప్పుతున్నారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఖలేజా చిత్రం రూపొందిస్తున్నారు. అనూష్క కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే వెంకటేష్ ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి సీక్వెల్ లో నటిస్తున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ ఖలేజా మహేష్ బాబు మల్లేశ్వరి trivikram srinivas venkatesh khaleja mahesh babu malleswari


Click it and Unblock the Notifications