»   » పవన్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్రని తప్పించేసారు..... ఆ స్థానం లో ఎవరో తెలుసా?

పవన్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్రని తప్పించేసారు..... ఆ స్థానం లో ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కలిస్తే తెరపై వినోదాల విందు పండినట్టే. వీరి కాంబినేషన్లో వచ్చిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలే అందుకు నిదర్శనం. వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మంచి విజయాలు అందుకున్న ఈ చిత్రాల సరసన మరో సినిమాను నిలిపే యత్నాల్లో ఉన్నారు త్రివిక్రమ్. పవన్ ప్రస్తుతం 'కాటమరాయుడు'తో బిజీగా ఉన్నారు.

ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఆయన మాటలమాంత్రికుడి టీమ్ తో జాయిన్ అవుతారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ప్రారంభంకానున్న త్రివిక్రమ్-పవన్ ల చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలొచ్చాయి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర‌తో ఓ పాత్ర చేయిస్తున్నారన్న కథనాలు వచ్చిన సంగతి ఇంకా కంఫార్మ్ కాకముందే. తాజాగా మరో ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

Trivikram and Pawan Kalyan's film has Mohanlal?

ఇప్పటికే బాలీవుడ్ ఆర్టిస్ట్ బొమన్ ఇరానిని సెలక్ట్ చేసుకున్నారు త్రివిక్రమ్. తాజాగా ఉపేంద్ర కూడా నటించనున్నారన్న వార్తలు వస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. గతంలో త్రివిక్రమ్ 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర నటించారు. పవన్ సినిమాలోని పాత్ర గురించి చెప్పగానే ఆయన ఉత్సాహంగా అంగీకరించాడట. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించే ఆలోచనలో వున్నారు. అయిత్వే ఉన్నట్టుండీ ఇంకో వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమా కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌‌లాల్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు త్రివిక్రమ్ వ్యూహాత్మకంగా మోహన్‌లాల్‌ను బరిలోకి దింపినట్టు ప్రచారం జరుగుతోంది. జనతాగ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు పెదనాన్నగా నటించిన మోహన్‌లాల్ పాత్రకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇటు టాలీవుడ్‌లోనూ మోహన్‌లాల్‌కు క్రేజ్ పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఉపేంద్రకు బదులు.. మోహన్‌లాల్‌ను త్రివిక్రమ్ తీసుకుంటున్నట్టు టాక్. జనతాగ్యారేజ్‌లో మోహన్‌లాల్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో.. అంతే ప్రాధాన్యంతో ఆ పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నాడట. అంతేగాకుండా పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది దసరా విడుదలకు సన్నద్ధమవుతున్న ఈ సినిమాపై త్రివిక్రమ్ ఇలాంటి నిర్ణయాలతో బాగానే హైప్ క్రియేట్ చేస్తున్నాడన్న చర్చ ఫిల్మ్‌నగర్‌లో సాగుతోంది ప్రస్తుతం.

English summary
The discussions are said to be in serious nod with Kalyan and Trivikra also Mohanlal is said to be kicked in regards to the part of discussions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu