»   » త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా హీరో నాని చిత్రం!

త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా హీరో నాని చిత్రం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య పలువురు నటులు, దర్శకులు సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. సొంతగా సినిమాలు నిర్మించాలని కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కలిసి నితిన్ మూవీకి నిర్మాతగా కొంత పెట్టుబడి పెట్టారు.

త్వరలో నాని హీరోగా తనే నిర్మాతగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారు.

 కథ నచ్చి

కథ నచ్చి

ఇటీవలే అవసరాల శ్రీనివాస్ తన వద్ద ఉన్న కథను త్రివిక్రమ్ కు వినిపించాడని, నాని హీరోగా అయితే ఈ కథ బావుంటుందని ఇద్దరూ డిసైడ్ అయి ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.

నాని

నాని

ప్రస్తుతం హీరో నాని రెండు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుండగా.... అవసరాల శ్రీనివాస్ కూడా ‘బాబు బాగా బిజీ' అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్, అవసరాల శ్రీనివాస్, నాని కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

అంచనాలు

అంచనాలు

వరుస విజయాలతో నాని మినిమమ్ గ్యారంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అవసరాల శ్రీనివాస్ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వీరికి త్రివిక్రమ్ ఇమేజ్ కూడా తోడైతే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.

English summary
As per the Film Nagar reports, Trivikram said to have choosen Avasarala Srinivas as the director of Nani film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu