For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందమైన అబద్దాలు చెప్పే కుర్రాడి కథే 'జులాయి'

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'తెల్లవారుఝామునలే.. బాగుపడతావ్‌' అని తండ్రి కొకుక్కి చివాట్లు పెడుతుంటే 'కోడి కూడా తెల్లవారే లేస్తుంది. ఏం చేస్తున్నాం.. చికెన్‌ వండుకొని తినేస్తున్నాం' అని సెటైర్లు వేసే జులాయినే ప్రచార చిత్రాల్లో చూస్తున్నారు. వింటుంటే 'నిజమే కదా?' అనిపిస్తుంది. వాస్తవ జీవితంలో ఇవన్నీ అందమైన అబద్ధాలు. మరి హీరో నిజం ఎలా తెలుసుకొన్నాడనేదే సినిమా. ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి అల్లరి వేషాలేసి, రెండోది బాధ్యత తెలిసొచ్చి. అలాంటి హీరోగా అల్లు అర్జున్‌ని చూస్తారు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జులాయి'ఆగస్టు 9 న విడుదల అవుతోంది.

  అలాగే ఈతరం అబ్బాయిలకు ఓ పద్ధతంటూ ఉంది. 'ఇది తప్పు..' అని ముద్రపడిన ప్రతి విషయాన్నీ రుచి చూస్తారు. కానీ వారి హద్దుల్లోనే ఉంటుంటారు. రోజుకి నాలుగు సిగరెట్లు మాత్రమే తాగుతారు. ఎందుకంటే ఐదోది కొనలేక. సెకండ్‌ షో చూశాక నేరుగా ఇంటికొచ్చేస్తారు.. ఎందుకంటే ఆ తరవాత బయట తిరగలేక. ఇలాంటి వారినే 'జులాయి' అంటుంటారు. ఈ లక్షణాలన్నీ అక్షరాలా పుణికిపుచ్చుకొన్న రవి అనే అల్లరి అబ్బాయి కథ ఇది అని అన్నారు.

  అల్లు అర్జున్ మాట్లాడుతూ...''త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఓ అందమైన అనుభవం. అలాగే మళ్లీ నా సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడం, ఇలియానాతో తొలిసారి నటించడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారితో తొలిసారి నటిస్తున్నాను. ఆయన డైలాగ్ టైమింగ్ సూపర్బ్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో డైలాగ్స్‌కి విజిల్స్ పడతాయి'' అని అన్నారు.

  'జులాయి' స్టోరీలైన్ విషయానికి వస్తే...పని, పాట లేకుండా తిరిగేవాడ్ని పెద్దలు 'జులాయి' అంటుంటారు. ఆ పెద్దలే... మగాడు తిరక్క చెడతాడు... ఆడది తిరిగి చెడుతుంది అని సూక్తులు వల్లిస్తుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలాకష్టం. అందుకే ఆ పెద్దల తిట్లను కూడా ఆశీర్వాదాలుగా తీసుకుంటుంటాడు ఓ కుర్రాడు. వాళ్లు 'వెధవ' అన్నా... 'వెయ్యేళ్లు ధనముతో వర్థిల్లు' అని దీవించినంత ఆనందపడిపోతాడు. అలాంటి కుర్రాడికి ఓ కుర్రది తారసపడితే... ఇక ఆ సందడికి హద్దు ఉంటుందా... అల్లు అర్జున్ 'జులాయి' సినిమా నడక ఇలాగే ఉంటుంది . సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.

  English summary
  
 Allu Arjun's upcoming movie Julayi, which is one of the most-awaited movies of 2012, is finally all set to release in 1,600 theatres across the country on this Friday, August 9. This romance drama deals with how the life of an aimless guy changes after he falls in love with a girl. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X