»   » నా భార్యను చూసి షాక్ తింటుంటా: త్రివిక్రమ్

నా భార్యను చూసి షాక్ తింటుంటా: త్రివిక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trivikram Srinivas about Attarintiki Daaredi
హైదరాబాద్ :నాకు ఆడవాళ్ల మనసు పూర్తిగా తెలియదు. నా భార్యను చూసి చాలా సార్లు షాక్ తింటుంటా. మగాడు ఊహించని యాంగిల్ ఉంటుంది అమ్మాయిల్లో . కానీ ఒకటి నిజం.. అంతా అంటున్నట్టు అమ్మాయిలు అత్యాశపరులు మాత్రం కాదు. వాళ్లలో ఈగో ఉండదు. ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. నచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా చెప్పేస్తారు. కానీ మగవాళ్లు గుంభనంగా ఉంటారు. అంతెందుకు నాతోటి దర్శకులు తీసిన సినిమాలను నేను కాస్త బిగుసుకుపోయే చూస్తాను. కానీ నా భార్య ఓపెన్‌గా చూస్తుంది. అంత ఓపెన్ మనసు నాకు లేదు. కానీ పక్కవాళ్లు మంచి చేస్తే మనస్ఫూర్తిగా అభినందించే గుణం మాత్రం ఇంకా నాలో మిగిలే ఉంది అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.


పవన్‌కల్యాణ్‌తో హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' వంద కోట్ల క్లబ్‌లో చేరనుందనేది ట్రేడ్ పండితుల విశ్లేషణ. దాంతో పవన్ లాంటి పవర్ ఫుల్ స్టార్ తో యాక్షన్ తగ్గించి కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం చేయాలని త్రివిక్రమ్ కి ఎందుకు అనిపించింది అనేది అందరికీ ప్రశ్నే. ఆయన ముందే ఈ విజయం ఊహించి చేసారా...లేక తన మార్కుతో పవన్ ని చూపెట్టాలనే ఆలోచనే ఈ చిత్రం రూపొందేలా తయారుచేసిందా అనే ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇచ్చారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌తో ఫ్యామిలీ స్టోరీని ప్లాన్ చేయాలనిని నేను కథ రాసుకునేటప్పుడు అవేమీ ఆలోచించలేదు. దర్శకుడిగా యాక్షన్ సినిమాలు చేశాను. కానీ పూర్తిస్థాయి కుటుంబకథా చిత్రం చేయలేదు. చేయాలనిపించింది. ఈ కథ చేశాను.ఈ సినిమా థాట్ ఎలా వచ్చిందంటే...'ఖలేజా' తర్వాత రాసుకున్న కథ ఇది. 'తీన్‌మార్' టైమ్‌లో పవన్‌గారికి చెప్పాను. ఆ తర్వాత ఆయన 'గబ్బర్‌సింగ్'తో బిజీ. నేను 'జులాయి' చేశాను. తర్వాత ఈ సినిమా చేశాం. ఇప్పుడంతా శుభం అన్నారు.

ఇక పవన్ తో తన భావజాలం కలవటం గురించి చెప్తూ... పనివేరు. వ్యక్తిగతం వేరు. కాకపోతే నాకు కల్యాణ్‌గారితోనూ, మహేష్‌గారితోనూ కంఫర్ట్ లెవల్స్ ఎక్కువ. వాళ్లు స్టార్స్ అనే విషయాన్ని మర్చిపోతారు. చాలా ఈజీగా తీసుకుంటారు. అందుకే వాళ్లతో పనిచేయడం చాలా ఈజీగా భావిస్తాను అన్నారు. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్‌ను యువత బెంచ్ మార్కుల్లాగా భావిస్తున్నప్పుడు నిజంగా భయమేస్తుంది. ఆత్రేయ, జంధ్యాల, ముళ్లపూడి, మల్లాది వీళ్లందరూ ఎంతో గొప్పగా రాసిన సందర్భాలున్నాయి. వాళ్లందరినీ చూసిన నేను నన్ను పయనీర్ అని అనుకోను అన్నారు.

English summary
After facing several postponements in its release, Attarintiki Daredi released in theatres on September 27. Now, the movie is running in its fourth week of release, but still the movie keeps the bells ringing at the box office. Though the film faced competition with Ramayya Vasthavayya and Doosukeltha, the Trivikram Srinivas directed movie has collected approximately Rs 73.28 crores nett at the worldwide Box Office in just 26 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu