twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితంలో అలాంటి సీన్లు తీయను.. నయనతార సినిమా చూడలేక టీవీ ఆఫ్ చేశా.. త్రివిక్రమ్!

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో తన సత్తా ఏంటో నిరూపించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో యుద్ధం తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆసక్తిక్రమైన పాయింట్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా చేయలేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయట. ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

    చిన్న పిల్లలకు

    చిన్న పిల్లలకు

    కొందరు దర్శకులని గమనిస్తే తాము అలాంటి సన్నివేశాలు తీయమని, నాకు ఈ జోనర్ చిత్రాలే ఇష్టమని చెబుతుంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. రచయితగా అద్భుతమైన కథలు సృష్టించే త్రివిక్రమ్ చిన్న పిల్లలకు సంబందించిన కొన్ని సన్నివేశాలు మాత్రం తీయలేదంట.

    వాళ్లు నా శత్రువులు అంటూ త్రివిక్రమ్ షాక్, ఇకపై ఎవరూ పిలవరేమో? వాళ్లు నా శత్రువులు అంటూ త్రివిక్రమ్ షాక్, ఇకపై ఎవరూ పిలవరేమో?

    జీవితంలో చేయను

    జీవితంలో చేయను

    త్రివిక్రమ్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలు బాధపడుతుంటే నేను చూడలేను. అలాంటి సన్నివేశాలు నా జీవితంలో తీయని అని త్రివిక్రమ్ తెలిపాడు. తప్పని పరిస్థితుల్లో ఆ సన్నివేశాలు తీయాల్సి వస్తే మార్చి చేస్తానని త్రివిక్రమ్ తెలిపాడు. వేరే చిత్రాల్లో అలాంటి సన్నివేశాలు ఉన్నా తాను చూడలేనని త్రివిక్రమ్ తెలిపారు.

    నయనతార సినిమా చూడలేక

    నయనతార సినిమా చూడలేక


    గత ఏడాది నయనతార కర్తవ్యం అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రంలో బోరుబావిలో పాప పడిపోయే సన్నివేశం చూడలేక మధ్యలోనే టివి ఆఫ్ చేశానని త్రివిక్రమ్ తెలిపాడు. కనీసం పేపర్ లో కూడా లాంటి వార్తలు చూడనని త్రివిక్రమ్ తెలిపారు.

    తదుపరి చిత్రం

    తదుపరి చిత్రం


    అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించడంతో త్రివిక్రమ్ తదుపరి చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చిత్రం ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

    English summary
    Trivikram Srinivas about his limitation as director. He dont want to do that scenes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X