twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సన్నాఫ్ సత్యమూర్తి' మైనస్ లపై త్రివిక్రమ్ వివరణ (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: నేను రాసుకున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' కథను నిజాయతీగా తెర కెక్కించడానికి ప్రయత్నించా. ఆ క్రమంలో ఏ మేరకు కుదిరితే అంతే వినోదం ఉంది. ఏవేవో ఐటమ్ ఇరికించలేదు. ఒక కథ అనుకున్నాక, ఆ కథలో చేసే హీరోకు తగ్గట్లు కొంత సర్దడం సహజం. కథను నిజాయతీగా తెరకెక్కిస్తూనే, వాణిజ్యపరంగా పెట్టుబడి తిరిగొచ్చేలా డిజైన్ చేస్తుంటాం. అదే సమయంలో నా మటుకు నేను చెప్పాలనుకున్న విలువల గీత దాటకుండా చూసుకుంటా అంటున్నారు త్రివిక్రమ్.

    'స్వయంవరం'తో స్వతంత్ర సినీ రచయితగా మొదలుపెట్టి, 'నువ్వే - నువ్వే'తో దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఇప్పటికి అరడజను సినిమాలను దర్శకుడిగా అందించారు. మనుషుల మధ్య అనుబంధాలు, మనవైన విలువలను తెరపై ఆవిష్కరించి, మనల్ని మనకే గుర్తుచేసే ఈ దిట్ట అల్లు అర్జున్‌తో తన తాజా ఏడో చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'లోనూ ఆ పనే విజయవంతంగా చేశారు.

    'సన్నాఫ్‌ సత్యమూర్తి'. నాన్న గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారిందులో. సత్యమూర్తి ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చిన కబుర్లు ఇవీ..

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    స్లైడ్ షోలో... ఇంటర్వూ..పూర్తిగా...

    'సత్యమూర్తి..' మీ లక్ష్యాన్ని చేరుకొన్నట్టేనా?

    'సత్యమూర్తి..' మీ లక్ష్యాన్ని చేరుకొన్నట్టేనా?

    సోమవారం వరకూ ఆగాలి. ఎందుకంటే జనాలు పూనకం వచ్చినట్టు వెళ్లిపోవడానికి ఇదేం మాస్‌ సినిమా కాదు. దీర్ఘకాలంలో ప్రేక్షకులు చెప్పాలి. ఇక వసూళ్లంటారా... మా సినిమా ఇంత చేసింది, అంత చేసింది అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు.

    ప్రేక్షకుడిగా మీకేమనిపించింది?

    ప్రేక్షకుడిగా మీకేమనిపించింది?

    నిజం చెప్పాలంటే షాక్‌తిన్నా. ఎందుకంటే తొలి అర్ధ భాగం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ప్రేక్షకులు కథని ఎలా అర్థం చేసుకొంటారా అనిపించింది. కానీ.. సినిమా జరుగుతున్నంతసేపూ వాళ్ల దృష్టి తెరపైనే ఉంది. ఎక్కడ స్లో అయ్యిందనుకొన్నానో.. అక్కడ కూడా వాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నారు. హీరో ఆస్తి పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టారు. షేర్‌ ఆటోలో ఇబ్బందిపడుతున్నప్పుడూ.. వాళ్లలో అదే ఫీలింగ్‌.

    ఫ్యాన్స్ పంచ్‌లు తగ్గాయి అంటున్నారు.

    ఫ్యాన్స్ పంచ్‌లు తగ్గాయి అంటున్నారు.

    కేవలం అవే రాస్తే ఎలా..? వేరే కథలూ చెప్పాలి కదా. తండ్రి చనిపోయిన తరవాత కూడా హీరో పంచ్‌లేసుకొంటూ కూర్చుంటే పెద్దగా బాగోదు.

    రివ్యూలు కూడా సత్యమూర్తికి నెగిటివ్ గా

    రివ్యూలు కూడా సత్యమూర్తికి నెగిటివ్ గా

    నేను సమీక్షల్ని చదవనండీ.. అందుకే వాటి గురించి నాకు పెద్దగా తెలీదు. మిగతావారి మాటెలా ఉన్నా ప్రేక్షకుడు సినిమాని నిజాయతీగా చూస్తాడు. నచ్చితే బాగుంది అంటాడు. లేదంటే నచ్చలేదు అని చెప్పేస్తాడు. మనం అంత ఈజీగా ఉండలేం. 'బాగుంది.. కానీ..' అంటూ వంద లోటుపాట్లు చెబుతాం. 'సెకండాఫ్‌ ఇలా తీస్తే బాగుంటుంది..' అంటుంటాం. ఏదీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేం.

    ఆస్వాదించలేకపోతున్నాం

    ఆస్వాదించలేకపోతున్నాం

    సినిమాని సినిమాగా చూడం. వాటిలోని సూక్ష్మమైన విషయాల గురించి ఆలోచిస్తాం. సినిమా చూస్తుంటాం గానీ.. అందులో ఉండం. దాన్నుంచి మనం ఎప్పుడో బయటకు వచ్చేసుంటాం. అందుకే సినిమాని ఆస్వాదించలేకపోతున్నాం.

    విరక్తి వచ్చేసింది

    విరక్తి వచ్చేసింది

    నాకు బాగా గుర్తు.. 'ఛత్రపతి' ఫస్టాఫ్‌ చూసొచ్చా. బయట నేనూ నా స్నేహితుడూ ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకొంటున్నాం. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. 'సెకండాఫ్‌ చూడాలి మరీ..' అంటూ ఏదో చెబుతున్నాడు. ఫస్టాఫ్‌ బాగుంది కదా, సెకండాఫ్‌ చూడ్డానికి ఇంకా పదిహేను నిమిషాల సమయం ఉంది కదా.? ఈలోగా ఫస్టాఫ్‌ని ఎంజాయ్‌ చేయొచ్చు కదా..? బాగుంది అని చెప్పడానికి కూడా ఇష్టం లేదు అతనికి. అప్పటి నుంచీ.. థియేటర్లో సినిమా చూడాలంటే విరక్తి వచ్చేసింది. అందుకే మారుమూల థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తుంటా.

    హీరోయిన్ ని డయాబెటిక్‌ పేషెంట్‌లా చూపించారు

    హీరోయిన్ ని డయాబెటిక్‌ పేషెంట్‌లా చూపించారు

    మనదేశంలో డయాబెటిక్‌ అతి పెద్ద సమస్య. దాన్ని అంత సీరియస్‌గా కాకుండా.. ఇలాక్కూడా చూడొచ్చు అనిపించింది. . కమల్‌హాసన్‌, వసీం అక్రమ్‌ డయాబెటిక్‌తో బాధపడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. హీరోయిన్ అంటే.. మనలో అమ్మాయే. ఆమె పై నుంచి దిగిరాదు. నల్లగా ఉండే అమ్మాయిల్ని, చిన్న చిన్న సమస్యలతో బాధపడే అమ్మాయిల్నీ ఎవరో ఒకరు ప్రేమించొచ్చు. కానీ మనవాళ్లు కథానాయికకు ఇలాంటి సమస్యలంటే జీర్ణించుకోవడం కష్టం.

    అక్కడక్కడ పురాణ, ఇతిహాసాలను ప్రస్తావన కారణం

    అక్కడక్కడ పురాణ, ఇతిహాసాలను ప్రస్తావన కారణం


    వాటికి మించిన సాహిత్యం నేనింత వరకూ చదవలేదు. వాటిని దాటి ఎవ్వరూ రాయలేదు కూడా. మనకు ఎలాంటి విషయం కావాలన్నా..వాటిలో తప్పకుండా దొరికేస్తుంది. అందుకే రామయణ మహాభారతాల్ని కోట్‌ చేస్తుంటా.

    భాధేస్తుంది

    భాధేస్తుంది

    మీ సినిమాల్లో కొన్ని థియేటర్లో ఆడకపోయినా.. టీవీల్లో తెగ చూస్తుంటారు. ఇలాంటి విషయాలు తెలుస్తుంటే బాధేస్తుంది (నవ్వుతూ). మనం టీవీలకు మాత్రమే పనికొచ్చే సినిమాలు తీస్తామా? అనిపిస్తుంటుంది. ఓ సినిమా టీవీలో మాత్రమే చూశారంటే అది గొప్ప సినిమా కాదు. టీవీ ప్రేక్షకుడు వేరు. టీవీలో సినిమా వస్తుంటే పెద్దగా అంచనాలుండవు. రిలాక్స్‌గా చూడొచ్చు. థియేటర్లో అన్ని సౌలభ్యాలుండవు.

    కథలు హీరోలను దృష్టిలో ఉంచుకొనే రాస్తారా

    కథలు హీరోలను దృష్టిలో ఉంచుకొనే రాస్తారా

    రాసుకొన్న తరవాత హీరో వచ్చినా.. వాళ్లను దృష్టిలో ఉంచుకొని కథలో సర్దుబాట్లు చేసుకోవాలి. అవి తప్పవు. బడ్జెట్‌ కూడా అంతే. ముందు స్క్రిప్టు పూర్తయ్యాకే బడ్జెట్‌ ఎంతో నిర్ణయించుకొంటాం. హీరోని బట్టి ఆ సినిమా ఏ స్థాయిలో తీయాలో అంచనా వేసుకోవాలి. లేదూ.. ఈ కథని పూర్తిగా కొత్తవాళ్లతో తీయాలనుకొంటే తీసే పద్ధతి, బడ్జెట్‌ రెండూ మారతాయి. హీరోల కోసమూ కథలు రాయాలి. దాంతో పాటు నేను చెప్పాలనుకొన్న విలువల్ని వదిలేయకూడదు. రెండింటి మధ్య సమతుల్యం చాలా అవసరం.

    త్రివిక్రమ్ అంటే బ్రాండ్

    త్రివిక్రమ్ అంటే బ్రాండ్

    బ్రాండ్‌ అంటే భయం వేస్తుంది. నేనేదో నాకొచ్చింది రాస్తాను. నచ్చితే చూడండి. లేదంటే తిట్టండి. నేనేదీ సీరియస్‌గా తీసుకోను. సింపుల్‌గా ఉండడం నాకిష్టం.

    భయాలు,ఈగోలు

    భయాలు,ఈగోలు

    నాకూ సవాలక్ష సమస్యలుంటాయి. ఈగో, భయాలూ ఇవన్నీ ఉంటాయి. 'నా ఒక్కడి సినిమానే ఆడాలి' అనుకొంటా. కానీ బయట మాత్రం నవ్వుతూ.. 'అందరి సినిమాలూ బాగుండాలి..' అనాలి. తప్పదు. ఇలాంటి ఇగోల్ని ఒకొక్కటీ వలుచుకొని.. స్వచ్ఛంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంటా. నా ఒక్కడి సినిమానే ఆడి, అందరి సినిమాలూ పోతే... కనీసం నాతో సినిమా చేయడానికికైనా ప్రొడ్యూసర్‌ ఉండాలి కదా... (నవ్వుతూ)

    ఎవడి గొడవ వాడితే..

    ఎవడి గొడవ వాడితే..

    సినిమా అనేది బంతి విసరడం లాంటిది. ఆ బంతికి సిక్స్‌ కొడతారా, ఫోరా, లేదంటే ఔటా అనేది చెప్పలేం. నా సినిమా సూపర్‌ హిట్టయిపోయిందనుకోండి. బయటకు వచ్చి గంతులు వేయలేను. ప్రపంచం మామూలుగానే ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్య క్లియర్‌ అవ్వదు. ఎవడి గొడవ వాడిదే. నా సినిమా సూపర్‌ హిట్‌ అని అరిచాననుకోండి... 'ఓహో. అలానా.' అంటారు.

    ఇద్దరం ఏడవాలి

    ఇద్దరం ఏడవాలి

    పోనీ. నా సినిమా ఫ్లాప్‌ అయ్యిందనుకోండి. బయటకు వచ్చి.. 'ఫ్లాప్‌' అని ఏడవలేను. నా కష్టాలు చెప్పుకొందామనుకొంటే... వాడి కష్టాలు చెప్పడం మొదలెడతాడు. ఆ తరవాత ఇద్దరం కూర్చుని ఏడవాలి.. (నవ్వుతూ). సినిమా ఫలితం కంటే.. ఆ ప్రయాణమే ఎక్కువగా కిక్‌ ఇస్తుంది. ఓ మంచి సీన్‌ రాస్తే.. ఆక్షణంలోనే కిక్‌ వచ్చేస్తుంది. ఆ సంతోషం ముందు ఏదీ సరితూగదు.

    అపనమ్మకం..

    అపనమ్మకం..

    హీరో పాత్రను 300 కోట్లొదులుకొనే మంచివాడిగా చూపడం... మంచివాళ్ళ కథలు బోరింగ్‌గా ఉంటాయని మనకు అపనమ్మకం. కానీ, ఈ భూమండలంపై అతి మంచివాడిగా కనిపించే రామాయణంలో రాముడి కథే చూడండి - అది ఇప్పటికి ఎన్నో భాషల్లో వచ్చింది. ఎన్నోసార్లు తెరకెక్కింది. ఒక మంచి వాణ్ణి హీరోగా పెట్టుకొని, అతనికి ఎదురయ్యే సవాళ్ళను అతనెదు ర్కొన్న తీరుతో, కథను ఆసక్తికరంగా, ఇష్టపడేలా చెప్పాలని ప్రయత్నించా.

    ఈ చిత్రకథకూ, నిజజీవితానికీ సంబంధం

    ఈ చిత్రకథకూ, నిజజీవితానికీ సంబంధం

    నా వ్యక్తిగతం కాదు కానీ, చాలామంది జీవితాల్లో జరిగిన విషయాలు, నా స్నేహితులు, బంధువుల కుటుంబాల్లో జరిగిన కొన్ని ప్రధాన ఘటనల్ని సినిమాకు తగ్గట్లు నాటకీయంగా మలుచుకొని చేశా.

    మా అమ్మ,మేనమామలనుంచే...

    మా అమ్మ,మేనమామలనుంచే...

    ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్‌ల ఘట్టం పశ్చిమగోదావరి జిల్లాలోని వేగేశ్వరపురం అనే చిన్న ఊరులోని మా అమ్మ మేనమామల జీవితం నుంచి ప్రేరణ పొంది తీసుకున్నా. అన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిన తమ్ముడు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాలుగా కలిసుంటున్న ఆ కుటుంబాల స్ఫూర్తితో ఆ ఘట్టాన్ని సినిమాకు తగ్గట్లుగా మలిచా.

    ప్రకాశ్‌రాజ్, బన్నీల మధ్య ఇంకా సీన్లు పెట్టాల్సిందేమో?

    ప్రకాశ్‌రాజ్, బన్నీల మధ్య ఇంకా సీన్లు పెట్టాల్సిందేమో?

    ఈ కథలో తండ్రి గొప్పతనం గురించి చెప్పాలనుకున్నా కానీ, ఆ పాత్రతోనే కథ నడపాలనుకోలేదు. కొడుకుకూ, తండ్రికీ మధ్య సీన్లతో ఆ గొప్పతనం చెప్పా లనుకోలేదు. తండ్రి, ఆస్తి ఉండగా కొడుకు గొప్పగా మాట్లాడే కన్నా, రెండూ పోయాక, తండ్రి గొప్పతనం కోసం కొడుకు పాటుపడడం గొప్పే కదా!

    బన్నీ ఎనర్జిటిక్‌గా లేరనీ...

    బన్నీ ఎనర్జిటిక్‌గా లేరనీ...

    'జులాయి', 'రేసుగుర్రం' లాంటి చిత్రాల్లో ఉరికే జలపాతంలో ఉత్సాహంగా ఉండే బన్నీని చూశాం. మళ్ళీ అదే పద్ధతిలో కంఫర్ట్ జోన్‌లో వెళ్ళకుండా, హుందాగా, బాధ్యతతో కూడిన పాత్రలో ఆయనను చూపాలని కావాలనే నిర్ణయించుకున్నాం.

    విలన్ బలంగా లేడు

    విలన్ బలంగా లేడు

    ఈ కథలో ఉపేంద్రను చంపాలని చూసే సంపత్‌రాజ్ విలన్. కానీ, అతనికీ, హీరోకూ నేరుగా ఘర్షణ లేదు. పైగా, హీరోతో, విలన్‌ను చంపించడమనే కాన్సెప్ట్‌కు నేను కొంత వ్యతిరేకిని. 'వాదనల ద్వారా అభిప్రాయాలు మారవు, వ్యక్తులను చంపడం ద్వారా వ్యవస్థ మారదు' అని నా నమ్మకం. అందుకే, 'అతడు', 'జల్సా' - ఇలా దాదాపు నా ప్రతి సినిమాలో ఊహించని పరిస్థితులు, ఘటనల్లో విలన్ చనిపోతాడు తప్ప, హీరో చంపడు. ఇందులోనూ అంతే!

    అందరి బలహీనత

    అందరి బలహీనత

    మిశ్రమ స్పందన వినిపిస్తోంది... మనం ఏ ట్రేడ్‌లో ఉంటే అందులో తెలియకుండానే కొంత స్టిఫ్ అయిపోతుం టాం. సినీరంగంలోనూ అంతే. హాలులో కూర్చున్నా, చూస్తున్న సినిమాను ఆస్వాదించకుండా క్షణ క్షణానికీ అప్‌డేట్లు వాట్సప్‌లో, ట్విట్టర్‌లో ఇస్తాం. ఇది మనందరి బలహీనత.

    టాక్ నిజం కాదు

    టాక్ నిజం కాదు

    ఈ సినిమా నిర్మాణంలో మీరూ భాగస్వామి అని ఒక టాక్ నడుస్తోంది.. మా నిర్మాత రాధాకృష్ణ గారు, నేను బాగున్నాం. మా మధ్య గొడవలు పెట్టకండి బాబూ! ఇప్పటి దాకా ఏ సినిమాలోనూ నేను పైసా పెట్టుబడి పెట్టలేదు. భాగస్వామినీ కాలేదు. కాకపోతే, బడ్జెట్ నియంత్రణ లాంటి విషయాల్లో నిర్మాతకు మన వైపు నుంచి వీలైనంత సాయం చేస్తుంటాం.

    నాకే నచ్చదు

    నాకే నచ్చదు

    ఏ క్రియేటర్‌కీ తన సృష్టి తనకు పూర్తిగా నచ్చదు. ఇంకా ఏదో, మెరుగ్గా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనకున్న పరిమిత సమయం, బడ్జెట్‌లో ఉన్నంతలో బాగా తీస్తాం. తీరా అంతా అయ్యాక, బయటివాళ్ళకు తెలియకపోయినా మన లోటుపాట్లు మనకు తెలుస్తుంటాయి. అందుకే తీయడమైపోయాక, నా సినిమా కూడా నేను చూడలేను. నేను తీసింది నాకే నచ్చదు. ఆ సృజనాత్మక తృష్ణతో ఎప్పటికప్పుడు ఇంకా నేర్చుకొని, మరింత మంచి సినిమా తీయాలనుకుంటా. పాటలకూ, భోజనం సీన్‌కూ పేరొచ్చింది!

    పాటలు...

    పాటలు...

    కథ, సందర్భాలు చెప్పగానే దేవిశ్రీ చాలా మంచి పాటలిచ్చాడు. 'కమ్ టు ది పార్టీ' పాటకైతే, సీతా రామశాస్త్రి గారు పల్లవి రాశాక ట్యూన్ కట్టాడు. 'సూపర్ మచ్చీ' పాట మొదటి ట్యూన్ నచ్చలేదంటే, మరునాటికల్లా తానే పాట పల్లవి రాసి మరీ అద్భుతమైన ట్యూన్‌తో వచ్చాడు.

    ఎక్కువ ఆస్వాదిస్తా

    ఎక్కువ ఆస్వాదిస్తా

    ఉపేంద్ర ఇంట్లో భోజనం సీన్‌లో ఒక పాత్రకు భయం, మరోపాత్రకు ఆశ్చర్యం, వేరొక పాత్రకు జరిగిందేమిటో తెలియని తనం - ఇలా రకరకాల ఎమో షన్‌స ఉంటూనే, ప్రేక్షకు డికి మాత్రం వినోదం కలిగించాలి. అది రాయడం, తీయడం చాలా కష్టమైంది. అలాగే, అందరితో కటువుగా, భార్య వస్తుంటే మాత్రం మంచిగా ఉండే ఉపేంద్ర పాత్రలోని రెండు పార్శ్వాలను చూపే సీన్ కూడా! ఇలాంటివి బాగా రాశాక, దానితో కలిగే ఆనందం వేరు. అందుకే నేను తుది ఫలితం కన్నా, ఆ పని చేసే క్రమాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తా.

    మీ తదుపరి చిత్రం?

    మీ తదుపరి చిత్రం?

    ఇంకా ఏదీ ఖరారవలేదు.

    పవన్ కల్యాణ్, మీరు తీస్తామన్న 'కోబలి'?

    పవన్ కల్యాణ్, మీరు తీస్తామన్న 'కోబలి'?

    ఉంది. అది ఒక రకంగా ప్యారలల్ సినిమా. అందుకే, మేమే తీయాలను కున్నాం. సాంకేతికంగా క్లిష్ట మైన, ఉన్నత ప్రమా ణాలున్న ఆ చిత్రం కోసం విదేశీ నిపు ణుల్నీ సంప్రతిం చాం. అందుకే కొన్ని లక్షలు ఖర్చు చేశాం. త్వరలోనే చేస్తాం.

    పవన్ మీకు దేవుడా? అంతకు మించా?

    పవన్ మీకు దేవుడా? అంతకు మించా?

    మంచి మిత్రుడు. అంతే.

    రాజమౌళి హీరోలతో మీరు, మీ హీరో లతో ఆయన చేయరని

    రాజమౌళి హీరోలతో మీరు, మీ హీరో లతో ఆయన చేయరని

    (నవ్వేస్తూ...) కథకు తగ్గట్లు కుదిరిన హీరోలతో చేస్తాం తప్ప, ఫలానా వాళ్ళతో చేయకూడదని ఎవరూ అను కోరు. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇలా అందరితో చేయాలని ఉంది. కథ, డేట్లు కుదరాలిగా!

    రాజమౌళిలాగ మీరు చేసి,మార్కెట్ పెంచుకోవచ్చుగా..

    రాజమౌళిలాగ మీరు చేసి,మార్కెట్ పెంచుకోవచ్చుగా..

    'ఈగ', 'బాహుబలి' లాంటివి అలాంటి అద్భుత ప్రయ త్నాలు. నిజాయతీగా మన దగ్గరా అలాంటి కథ ఉంటే చేయాలి తప్ప, ఆయన చేస్తున్నారని మనమూ చేయాలనుకోవడం తప్పు.

    English summary
    Trivikram Srinivas said he is happy with Son of Satyamurthy output.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X