»   »  రామ్...త్రివిక్రమ్ కాంబినేషన్?

రామ్...త్రివిక్రమ్ కాంబినేషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram
చేసినవి మూడు సినిమాలే అయినా యూత్ లోతనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్. అలాగే రచయిత స్ధాయి నుండి అనూహ్యంగా ఎదిగి దర్శకుడు గా తన సత్తా ఏంటో చూపుతూ దూసుకుపోతున్న దర్శక,రచయిత త్రివిక్రమ్. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రామ్ బంధువు ప్రముఖ నిర్మాత అయిన 'స్రవంతి' రవికిషోర్ స్వయంగా వెళ్ళడించారు. రామ్‌, జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో స్రవంతీ మూవీస్‌ అధినేత రవికిషోర్‌ నిర్మించిన 'రెడీ' చిత్రం విడుదలయి శుక్రవారంతో వందరోజులు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన మీడియోతో చెప్పారు.

అలాగే రామ్‌ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించనున్నారని...ఆ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని... వేసవికి విడుదలవుతుందనీ త్వరలోనే వివరాలు వెళ్ళడిస్తానని అంటున్నారు. ఇక 'రెడీ' విజయం గురించి మాట్లాడుతూ..141 పింట్లతో 'రెడీ' సినిమాని విడుదల చేశాం. ఆ తర్వాత వాటి సంఖ్య 195కు పెరిగింది. దీనిని బట్టి సినిమా స్ట్రెంగ్త్‌ ఏమిటన్నది మీరే ఊహించుకోవచ్చు. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటూ, ఉన్నత నిర్మాణ విలువలు కలిగి ఉండటం వల్ల ఈ స్థాయి విజయం సాధ్యమైంది. మా సినిమా యూనిట్‌ మొత్తం చేసిన సమష్టి కృషి వల్లే ఇంత భారీ విజయాన్ని పొందగలిగాం. మా సినిమా శతదినోత్సవాన్ని అక్టోబర్‌లో జరుపడానికి సన్నాహాలు చేస్తున్నాం అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X