»   » త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు శుభవార్త

త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు శుభవార్త

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న 'అ...ఆ' సినిమా నెక్స్ట్ ప్రోజేక్ట్ సెట్ అయ్యింది. హీరో సూర్యాతో ఆయన సినిమాని ఓకే చేసారు. ఈ సినిమాని 2016 జులైలో సెట్స్ పైకి తీసుకెళ్ళె ఆలోచనలో ఉన్నారు. హీరోయిన్స్ వివరాలు త్వరలో వెల్లడి అవుతాయని సమాచారం. తమిళ,తెలుగు భాషల్లో స్టార్ హీరో గా వెలుగుతున్న సూర్యతో చిత్రం అనగానే యాక్షన్,ఫన్ తో కలిసిన సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

trivikram surya


కాకపోతే త్రివిక్రమ్ కోసం ఆరాటపడిన ఆఖిల్ ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. నిజానికి ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్.... మహేష్ బాబుతో చేస్తారని, పవన్ కళ్యాణ్ తో చేస్తారని గుసగుసలు వినిపించాయి...వీటికి చెక్ చెప్పేటట్టుగా ఈ ప్రాజెక్టు ఓకే చేసారు.

ప్రస్తుతం నితిన్, సమంత హీరోహీరోయిన్లు గా త్రివిక్రమ్ డైరక్షన్ లో తెరక్కెక్కుతున్న సినిమా ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి).

తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్. చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

trivikram.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Trivikram is getting ready to direct Tamil hero Surya in a Telugu-Tamil bilingual. Movie will begin the shoot of his bilingual from July 2016.
Please Wait while comments are loading...