twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ-త్రివిక్రమ్ మూవీ: ఎంఎస్ నారాయణ సమస్య తీరినట్లే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రముఖ తెలుగు కమిడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్.ఎస్ నారాయణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్‌ను షాక్ కు గురి చేసింది. ఆయన నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరికొన్నింటిలో ఆయన షూటింగ్ పూర్తయినా డబ్బింగ్ పూర్తి కాలేదు. డబ్బింగ్ పూర్తికాని సినిమాల్లో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా(సన్నాఫ్ సత్యమూర్తి) కూడా ఒకటి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఎంఎస్ నారాయణది ఓ టిపికల్ వాయిస్. ఈ మేరకు కొందరు మిమిక్రీ ఆర్టిస్టులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి ఎంఎస్ నారాయణ వాయిస్ పర్ ఫెక్టుగా చేసి చూపడంతో త్రివిక్రమ్ అతన్ని ఓకే చేసినట్లు, అతనితోనే డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

    Trivikram to take the help of Shiva Reddy

    ఈ చిత్రంలో ఎంఎస్ నారాయణకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్, అలీ, ఎంఎస్ నారాయణలకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సీన్ వివరిస్తున్న సందర్భంలో యూనిట్ సభ్యులు ఒకరుతీసిన స్టిల్ ఇది. ఎంఎస్ జీవితంలో ఇదే చివరి వర్కింగ్ స్టిల్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

    సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ఎంఎస్ నారాయణ భీమవరం వెళ్లారు. అక్కడ ఆయనకు మలేరియా సోకడంతో 19న ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పాటు షుగర్, కిడ్నీ, హార్ట్ సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌ కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 23న మరణించారు.

    English summary
    Trivikram is currently busy with the shaping up of the movie tentatively titled 'Son Of Satyamurthy' and in this the late M S Narayana has a significant role. Sources say Trivikram is likely to take the help of Shiva Reddy to mimic the voice of M S.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X