»   » నిజంగా సూపర్బ్ గా ఉంది: ప్రియాంక చోప్రా...‘వెంటిలేటర్‌’ (వీడియో)

నిజంగా సూపర్బ్ గా ఉంది: ప్రియాంక చోప్రా...‘వెంటిలేటర్‌’ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే హాలీవుడ్‌లోనూ అదరగొడుతున్న . ఈ మధ్య చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పర్పుల్‌ పెబల్‌ పిక్చర్‌ సంస్థపై చిత్రాలు నిర్మిస్తోంది. ఆమె నిర్మాతగా మరాఠి భాషలో తెరకెక్కుతోన్న చిత్రం 'వెంటిలేటర్‌'. రాజేష్‌ మపుస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.


ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ ఓ కీలక పాత్రలో నటించారు. 1994లో వచ్చిన షారుఖ్‌ఖాన్‌ చిత్రం 'కభీ హై కభీ నా' తర్వాతే అశుతోష్‌ మళ్లీ ఈ చిత్రంలోనే నటించారు. ఈ చిత్ర కథలోకి వెళితే.. గజానన్‌ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరతాడు. అతడికి వెంటిలేటర్‌పై చికిత్స మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ప్రస్తుతం ప్రియాంక భోజ్‌పురి, పంజాబీ భాషల్లోనూ చిత్రాలు నిర్మిస్తోంది.'

ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ ఓ కీలక పాత్రలో నటించారు. 1994లో వచ్చిన షారుఖ్‌ఖాన్‌ చిత్రం కభీ హై కభీ నా తర్వాతే అశుతోష్‌ మళ్లీ ఈ చిత్రంలోనే నటించారు. ప్రస్తుతం ప్రియాంక భోజ్‌పురి, పంజాబీ భాషల్లోనూ చిత్రాలు నిర్మిస్తోంది.

 Priyanka Chopra

బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది ప్రియాంక చోప్రా. అయినా తన అభిరుచిని చాటుకునేందుకు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ప్రాంతీయ చిత్రాల్లో ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో పర్పుల్‌ పెబల్‌ పిక్చర్స్‌ సంస్థపై లో బడ్జెట్‌ చిత్రాలను నిర్మించనుంది. ఇప్పటికే ఇట్స్‌ మై సిటీ అనే టీవీ సిరీస్‌ను నిర్మించిన ప్రియాంక అందులో అతిథి పాత్రలోనూ నటించింది.
ప్రస్తుతం పంజాబీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో చిత్రాలను నిర్మిస్తోంది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. పంజాబీలో నిర్మిస్తున్న సర్వాన్ ఇప్పటికే కెనడాలో తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. దీన్ని ప్రియాంకతో కలసి వసు భగ్నానీ నిర్మించనున్నారు.

సినిమాల నిర్మాణం పట్ల ప్రియాంక ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రాంతీయ భాషల్లో మా సంస్థ నిర్మిస్తున్న సినిమాలకు మంచి స్పందన వస్తోంది. సర్వాన్ తో పంజాబీలో అడుగుపెట్టబోతున్నాం. దీనికి వసు భగ్నానీ లాంటి నిర్మాత చేయూతనివ్వడం ఆనందంగా ఉందని చెప్పింది ప్రియాంక.

English summary
"'Ventilator', my first Marathi venture, is a film I'm truly proud of, and I can't wait for you guys to see it! November 4," Priyanka, who has also done a cameo in the film, tweeted on Wednesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu