»   » మహేష్ బాబు ఇంటి అద్దాలు పగలకొట్టి దొంగతన ప్రయత్నం

మహేష్ బాబు ఇంటి అద్దాలు పగలకొట్టి దొంగతన ప్రయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి మంకీ క్యాప్ ధరించిన ఓ వ్యక్తి ప్రవేశించి దొంగతనానికి యత్నించాడు. అయితే విఫలమైంది. ఎలర్టైన మహేష్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 81లో హీరో మహేశ్‌బాబు నివాసం ఉంది.

వివరాల్లోకి వెళితే ...బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మహేష్ బాబు ఇంటి ప్రహరీగోడ దూకిన అతను సెక్యూరిటీ కళ్లుగప్పి ఇంటి వెనకాల కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. నేరుగా మహేష్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్ వద్దకు చేరుకొని దొంగతనానికి యత్నించాడు. అలికిడి విన్న పని మనుషులు ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి నిలబడటంతో భయంతో అరిచారు. దీంతో సెక్యూరిటీగార్డ్‌లు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

అయితే అప్పటికే అతడు వెనక దారి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మహేష్ బాబు బయటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డ్‌ల ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. పశ్చిమ మండలం డీసీపీ కె. సత్యనారాయణ, బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని, మహేష్ బాబుతో మాట్లాడి సంఘటనలను తెలుసుకున్నారు. వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. కిటీకీపై పడ్డ వేలిముద్రలను సేకరించారు. ఐపీసీ సెక్షన్ 457, 511 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

English summary
A man wearing a monkey cap trying to theft at Mahesh Babu's house and failed. Police case is registered at Jubliee Hills Police station. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu