»   » కూతుళ్ళతో కలిసి కేక్ కటింగ్ : గర్వంగా ఉందన్న బాలయ్య (ఫోటోస్)

కూతుళ్ళతో కలిసి కేక్ కటింగ్ : గర్వంగా ఉందన్న బాలయ్య (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త సుబ్బిరామిరెడ్డి సోమవారం సాయంత్రం శతచిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణను "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రాన్ని "దానవీరశూర కర్ణ"తో పోల్చడం విశేషం.

నందమూరి బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సహజనటి జయసుధ, అందాల భామ తమన్నా, సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్, డైరెక్టర్ శ్రీవాస్ లు ఈ సన్మాన వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. "తెలుగు సినిమా చరిత్రలో "గౌతమిపుత్ర శాతకర్ణి" ఓ మైలురాయి లాంటిది. తెలుగువారికి తెలియని తెలుగు వీరుడ్ని క్రిష్ ప్రపంచానికి పరిచయం చేశాడు. కేవలం 79 రోజుల్లో ఈ అద్భుతాన్ని చిత్రీకరించడంతోపాటు.. అఖిలాంధ్ర ప్రేక్షకుల అభినందనలు అందుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. సీనియర్ ఎన్టీయార్ గారు ఎలా అయితే "దానవీరశూర కర్ణ"గా అందరికీ గుర్తుండిపోయారో.. అదే తరహాలో బాలకృష్ణ ముందు తరాలకి "గౌతమిపుత్ర శాతకర్ణి"గా గుర్తుండిపోతాడు. ఈ చిత్రం నెక్స్ట్ జెనరేషన్స్ కి ఒక పాఠ్యాంశంలా నిలుస్తుంది" అన్నారు.

 బాలకృష్ణగారి వేలిముద్ర ఈ చిత్రం

బాలకృష్ణగారి వేలిముద్ర ఈ చిత్రం

చిత్ర దర్శకులు క్రిష్ మాట్లాడుతూ.. "సినిమా రిలీజ్ అయినప్పట్నుంచి నా ఫోన్ కి వరుసబెట్టి అభినందనా సందేశాలు వస్తూనే ఉన్నాయి. సినిమా సక్సెస్ సాధించినదానికంటే.. ఓ తెలుగువాడి ఘన చరిత్రను తెలియజెప్పినందుకు నన్ను మెచ్చెకొంటుండడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణగారి వేలిముద్ర ఈ చిత్రం. ఆయన ఇదివరకూ నటించిన 99 సినిమా ఒకెత్తు అయితే.. ఈ 100వ చిత్రంలో ఆయన నటవిశ్వరూపం మరో ఎత్తు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం బాలకృష్ణగారికే చెందుతుంది" అన్నారు.

 నేను నటించడం అనేది గర్వకారణం

నేను నటించడం అనేది గర్వకారణం

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ""గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రంలో టైటిల్ పాత్ర పోషించే అవకాశం లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా నాన్నగారి ఆశీస్సుల వల్లే ఇలాంటి అద్భుతమైన చిత్రంలో భాగస్వామినయ్యే అవకాశం లభించింది. మా నాన్నగారు "శాతకర్ణు"డి చరిత్రను సినిమాగా తీద్దామనుకొన్నారు, అలాంటిది నేడు ఆ సినిమాలో నేను నటించడం అనేది గర్వకారణం. నాకు ఈ అద్భుత అవకాశాన్ని కల్పించిన దర్శకుడు క్రిష్ మరియు నిర్మాతలకు నా కృతజ్నతలు. అలాగే.. ఈ విధంగా కళలను ఎంకరేజ్ చేస్తున్న సుబ్బిరామిరెడ్డిగారికి నా ధన్యవాదాలు" అన్నారు.

 ఆ భావన పారద్రోలారు

ఆ భావన పారద్రోలారు

తమన్నా మాట్లాడుతూ.. "తెలుగు సినిమాలంటే కేవలం ఫక్తు కమర్షియల్ మూవీస్ మాత్రమే అని పరాయి రాష్ట్రాల వారి మనసులో ఉన్న భావాన్ని "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రంతో పారద్రోలిన దర్శకుడు క్రిష్ కి నా అభినందనలు. అతీత్వరలోనే నా ఫేవరెట్ డైరెక్టర్ క్రిష్ మరియు బాలకృష్ణగారితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. నన్ను ఈ వేడుకలో భాగస్వామిని చేసినందుకు సుబ్బిరామిరెడ్డి గారికి కృతజ్నతలు" అన్నారు.

"అద్భుతమైన చిత్రం" అంటున్నారు

సహజనటి జయసుధ మాట్లాడుతూ.. "సమయం అనుకూలించకపోవడం వల్ల నేనింకా ఈ సినిమా చూడలేదు కానీ.. నా ఫ్రెండ్స్ మాత్రం "అద్భుతమైన చిత్రం" అంటూ నాకు మెసేజులు పంపుతుండడంతో.. ఈ చిత్రాన్ని వెంటనే చూడాలన్న కోరిక బలంగా కలుగుతోంది. "గమ్యం" నుంచి నాకు క్రిష్ ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. టీం మొత్తానికి "గౌతమిపుత్ర శాతకర్ణి" ఘన విజయం సాధించినందుకుగాను అభినందనలు తెలియజేస్తున్నాను" అన్నారు.

 సన్మానం

సన్మానం

ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకులు క్రిష్, నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, బిబో శ్రీనివాస్, రచయిత బుర్రా సాయిమాధవ్, సినిమాటోగ్రాఫర్ జ్ణానశేఖర్, సంగీత దర్శకులు చిరంతన్ భట్, కళా దర్శకులు భూపేష్ భూపతి, స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, వి.ఎఫ్.ఎక్స్ ఎడ్వైసర్ రాజీవ్ రాజశేఖరన్, పి.ఆర్.ఓ వంశీ-శేఖర్, డిజైనర్స్ అనిల్-భానులను సన్మానించారు.

 ఈ వేడుకలో

ఈ వేడుకలో

ఈ వేడుకలో తమన్నా, జయసుధ, రాజకీయ నాయకులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, దగ్గుబాటి పురంధేశ్వరి, హీరో వెంకటేష్, ఎస్.ఎస్.రాజమౌళి, కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, ప్రసాద్ వి.పొట్లూరి, మంచు విష్ణు, మంచు మనోజ్, శుభలేక సుధాకర్, తనికెళ్లభరణి, టి న్యూస్ ఎం.డి సంతోష్, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి, సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.
వీరితోపాటు బాలకృష్ణ సతీమణి వసుంధరగారు మరియు ఆయన కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, క్రిష్ సతీమణి రమ్యలు ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు.

 కేక్ కటింగ్

కేక్ కటింగ్

నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి మరియు కుమార్తెల సమక్షంలో కేక్ కట్ చేసి.. "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రంలో "దేశం మీసం తిప్పుదాం" అనే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి ఆహుతులను అలరించారు!

English summary
Top industrialist, politician, producer and philanthropist felicitated Shatachitra Yodha Nandamuri Balakrishna, director Krish and entire team of Gautamiputra Satakarni on the massive success of historical film. Heaping the praises on Balakrishna for a powerful performance in title role and director Krish for believing in the story of unsung Telugu warrior emperor, T Subbirami Reddy compared Gautamiputra Satakarni with legendary NTR’s epic Dana Veera Soora Karna.Along with Balakrishna and Krish, chief guests who shared the stage are Sahajanati Jayasudha and glamorous Tamannah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more