»   » టాలీవుడ్ మొత్తాన్ని వైజాగ్ తీసుకెళ్తున్న తిక్కవరపు

టాలీవుడ్ మొత్తాన్ని వైజాగ్ తీసుకెళ్తున్న తిక్కవరపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఏప్రిల్ 8న వైజాగ్ గ్యాదర్ కాబోతున్నారు. అందుకు కారణం టీఆఎస్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ ఇక్కడ గ్రాండ్ గా జరుగబోతుండటమే. టాలీవుడ్ మొత్తం వైజాగ్ వచ్చేలా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి (టీఎస్ఆర్) గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు.

టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవితో పాటు కృష్ణం రాజు, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ పలువురు యంగ్ హీరోలు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

బాలీవుడ్ నుండి

బాలీవుడ్ నుండి

హిందీ చిత్ర సీమ నుండి హేమా మాలిని, శతృజ్ఞసిన్హా, మాదురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ లాంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

కనీ వినీ ఎరుగని రీతిలో వేడుక

కనీ వినీ ఎరుగని రీతిలో వేడుక

ఈ అవార్డుల వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు తిక్కవరపు. ఈ వేడుకకు విశాఖలోని పోర్టు స్టేడియం వేదిక కానుంది. స్పాన్సర్ల సహాయం లేకుండా సొంత ఖర్చుతో సుబ్బిరామిరెడ్డి ఈ వేడుక నిర్వమిస్తున్నారు.

50వేల మందితో

50వేల మందితో

ఈ వేడుక గురించి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఎన్నడూ జరుగనంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. సాధారణంగా సినిమా ఫంక్షన్లు ఆడిటోరియం లేదా క్లోజ్డ్ హాల్స్ లో జరుగుతుంటాయి. తొలాసారిగా ఈ వేడుకను ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నాం. 50వేల మంది ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

కమర్షిల్ ఉద్దేశం లేదు

కమర్షిల్ ఉద్దేశం లేదు

ఇతర సినిమా అవార్డులకు భిన్నంగా టీఎస్ఆర్ పిల్మ్ అవార్డ్స్ ఉంటాయి. ఈ వేడుక నేను సొంతగా నిర్వహిస్తున్నాను. ఎలాంటి స్పాన్సర్లు లేరు. అవార్డుల వేడుకలో ఎలాంటి కమర్షియల్ ప్రాసెస్ లేదు. 9 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ద్వారా అవార్డులకు నటీనటుల ఎంపిక జరుగుతుంది అని టీఎస్ఆర్ తెలిపారు.

60 మంది స్టార్స్

60 మంది స్టార్స్

తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ సినీ పరిశ్రమ నుండి స్టార్స్ వస్తున్నారు. మొత్తం 60 మంది వరకు స్టార్స్ ఈ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొంటారు అని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

ఆట పాట

ఆట పాట

ఈ అవార్డుల ఫంక్షన్లో భాగంగా మన్నారా చోప్రా, హంసా నందిని, మంజుల కూతురు శ్రీదేవి, అర్చన, గౌరీ మంజల్, అలీ లాంటి వారు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

కీలక ప్రకటన

కీలక ప్రకటన

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా తీయబోతున్నట్లు సుబ్బిరామిరెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి సుబ్బిరామిరెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

English summary
Most of the top stars of Tollywood are set to gather in Vizag on April 8 for the TSR film awards, given by T. Subbarami Reddy, which will be held in Port Stadium, Visakhapatnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu