»   » 2015-2016 అవార్డ్ విన్నర్స్ లిస్టులో వెంకీ, బాలయ్య, నాగ్, బన్నీ!

2015-2016 అవార్డ్ విన్నర్స్ లిస్టులో వెంకీ, బాలయ్య, నాగ్, బన్నీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీఎస్ఆర్-టీవీ9 ఫిల్మ్ అవార్డ్స్ వైజాగ్ లో ఏప్రిల్ 8న గ్రాండ్ గా జరుగబోతున్నాయి. టి.సుబ్బరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్‌ తరుపున తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర రంగాల్లో 2015, 2016 సంవత్సరాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందజేయనున్నారు.

హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అవార్డుల విజేతలను ప్రకటించారు. అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యులైన బి.గోపాల్‌, రఘురామ కృష్ణంరాజు, పింకీరెడ్డి, పొట్లూరి వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

2015 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

2015 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

1) ఉత్తమ నటుడు- వెంకటేష్‌(గోపాల గోపాల)
2. ఉత్తమ కథానాయకుడు- అల్లు అర్జున్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)
3) బెస్ట్‌ ఔట్‌స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు- అల్లు అర్జున్‌ (రుద్రమదేవి)
4) ఉత్తమ నటి- శ్రియ (గోపాల గోపాల)
5) ఉత్తమ కథానాయిక- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (బ్రూస్‌లీ, పండగ చేస్కో)
6) బెస్ట్‌ డెబిట్‌ హీరో- ఆకాష్‌ పూరి (ఆంధ్రా పోరి)
7) బెస్ట్‌ డెబట్‌ హీరోయిన్‌- ప్రగ్యా జైశ్వాల్‌ (కంచె)
8) ఉత్తమ దర్శకుడు- గుణశేఖర్‌ (రుద్రమదేవి)
9) ఉత్తమ చిత్రం- కంచె
10) ఉత్తమ ప్రతినాయకుడు- ముఖేష్‌రుషి (శ్రీమంతుడు)
11) బెస్ట్‌ క్యారక్టర్‌ యాక్టర్‌ (మహిళ)- నదియా (బ్రూస్‌లీ)
12) ఉత్తమ కమెడియన్‌- అలీ (సన్నాఫ్‌ సత్యమూర్తి)
13) ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీ ప్రసాద్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)
14) ఉత్తమ నేపథ్య గాయకుడు- దేవీశ్రీ ప్రసాద్‌ (సూపర్‌ మచ్చీ- సన్నాఫ్‌ సత్యమూర్తి)
15) ఉత్తమ నేపథ్య గాయని- యామిని (మమతల తల్లి6 బాహుబలి)

2016 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

2016 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

1) ఉత్తమ కథానాయకుడు- నందమూరి బాలకృష్ణ (డిక్టేటర్‌)
2) ఉత్తమ నటుడు- అక్కినేని నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా)
3) స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు- రామ్‌చరణ్‌ (ధృవ)
4) స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ ఫర్‌ పాపులర్‌ ఛాయిస్‌- నాని (జెంటిల్‌మేన్‌)
5) ఉత్తమ నటి- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (ధృవ, నాన్నకు ప్రేమతో)
6) ఉత్తమ కథానాయిక- క్యాథరీన్‌ ట్రెసా (సరైనోడు)
7) బెస్ట్‌ డెబట్‌ కథానాయిక- నివేదా థామస్‌ (జెంటిల్‌మేన్‌)
8) ఉత్తమ దర్శకుడు- సురేందర్‌రెడ్డి (ధృవ)
9) ఉత్తమ చిత్రం- వూపిరి
10) ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (బాబు బంగారం)
11) ఉత్తమ సంగీత దర్శకుడు- ఎస్‌ఎస్‌ థమన్‌ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు)
12) ఉత్తమ నేపథ్య గాయకుడు- శ్రీకృష్ణ (జెంటిల్‌మేన్‌)
13) ఉత్తమ నేపథ్య గాయని- ప్రణవి (జెంటిల్‌మేన్‌- గుసగుసలాడే)

జ్యూరీ అవార్డ్స్‌ డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ ఫర్‌ ది ఇయర్స్‌- 2015, 2016

జ్యూరీ అవార్డ్స్‌ డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ ఫర్‌ ది ఇయర్స్‌- 2015, 2016

1). నేషనల్‌ స్టార్‌ అవార్డు- ప్రభాస్‌ (బాహుబలి)
2). స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌- రానా (బాహుబలి)
3). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- మాస్‌ ఎంటర్‌టైనర్‌- కళ్యాణ్‌రామ్‌ (పటాస్‌)
4). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమనటి- మంచు లక్ష్మీ (దొంగాట)
5). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ కథానాయిక- హెబ్బా పటేల్‌ (కుమారి 21ఎఫ్‌)
6). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ దర్శకుడు- క్రిష్‌ (కంచె)
7). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ సంగీత దర్శకుడు- మణిశర్మ (ఎన్‌బీకే లయన్‌)
8). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- గాయకుడు- సింహ (దిమ్మతిరిగే.. శ్రీమంతుడు)
9). స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డ్‌- నాగచైతన్య (ప్రేమమ్‌)
10). స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ ఉత్తమ దర్శకుడు- ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్‌మేన్‌)
11). బెస్ట్‌ ఆల్‌రౌండ్‌ యాక్టర్‌- రాజేంద్రప్రసాద్‌ (నాన్నకు ప్రేమతో)
12). స్పెషల్‌ అప్రిసియేషన్‌ యాక్టర్‌ అవార్డు- శర్వానంద్‌ (ఎక్స్‌ప్రెస్‌ రాజా)
13). స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డు- నారా రోహిత్‌ (జో అచ్యుతానంద)
14). బెస్ట్‌ ప్రామిసింగ్‌ హీరో- విజయ్‌ దేవరకొండ (పెళ్లిచూపులు)
15). బెస్ట్‌ ప్రొగ్రెసివ్‌ ఫిలిం- పెళ్లి చూపులు
16). బెస్ట్‌ అప్‌కమింగ్‌ యాక్టర్‌- దీపక్‌ సరోజ్‌ (మిణుగురులు)
17). ఉత్తమ బాలనటుడు- మాస్టర్‌ ఎన్‌టీఆర్‌ (గ్రాండ్‌ సన్‌ ఆఫ్‌ ఎన్‌టీఆర్‌- దానవీరశూరకర్ణ)
18). ఉత్తమ బాలల చిత్రం- దానవీరశూరకర్ణ
19). స్పెషల్‌ అప్రిసియేషన్‌ డైరెక్టర్‌ అవార్డు- నాగ అశ్విన్‌ (ఎవడే సుబ్రమణ్యం)
20). స్పెషల్‌ అప్రిసియేషన్‌ డైరెక్టర్‌ అవార్డు- బాబ్జీ (రఘుపతి వెంకయ్య)
21). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- నేపథ్య గాయని- సమీర (తెలుసా తెలుసా.. సరైనోడు)
22). ఉత్తమ నటుడు (తమిళం)- మాధవన్‌
23). ఉత్తమనటి (తమిళం)- హన్సిక
24). ఉత్తమనటి (కన్నడ)- ప్రియమణి
25). బెస్ట్‌ డెబట్‌ యాక్టర్‌ (కన్నడ)- నిఖిల్‌ గౌడ
26). బెస్ట్‌ ప్రామిసింగ్‌ నటి (హిందీ)- సోనాలీ చౌహాన్‌
27). బెస్ట్‌ ప్రామిసింగ్‌ నటి (హిందీ)- వూర్వశి రౌటెల

స్పెషల్‌ జ్యూరీ అవార్డ్సు డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ

స్పెషల్‌ జ్యూరీ అవార్డ్సు డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ

1). మిలినీయం స్టార్‌ అవార్డు- కథానాయకుడు- శతృఘన్‌ సిన్హా
2). మిలినీయం స్టార్‌ అవార్డు- కథానాయిక- హేమా మాలిని
3). సెన్సేషనల్‌ స్టార్‌ అవార్డు- జాకీ ష్రాఫ్‌
4). 5డికేడ్స్‌ స్టార్‌ అవార్డు- కృష్ణంరాజు
5). 4డికేడ్స్‌ స్టార్‌ అవార్డు- మోహన్‌బాబు
6). లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు- బప్పీలహరి(సంగీత దర్శకుడు)
7). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- రేవంత్‌ (ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌)

టాలీవుడ్ మొత్తం వైజాగ్ బాట

టాలీవుడ్ మొత్తం వైజాగ్ బాట

ఈ అవార్డు వేడుక నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఏప్రిల్ 8న వైజాగ్ గ్యాదర్ కాబోతున్నారు. టాలీవుడ్ మొత్తం వైజాగ్ వచ్చేలా తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి (టీఎస్ఆర్) గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు.

బాలీవుడ్ నుండి

బాలీవుడ్ నుండి

హిందీ చిత్ర సీమ నుండి హేమా మాలిని, శతృజ్ఞసిన్హా, మాదురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ లాంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

కనీ వినీ ఎరుగని రీతిలో వేడుక

కనీ వినీ ఎరుగని రీతిలో వేడుక

ఈ అవార్డుల వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు తిక్కవరపు. ఈ వేడుకకు విశాఖలోని పోర్టు స్టేడియం వేదిక కానుంది. స్పాన్సర్ల సహాయం లేకుండా సొంత ఖర్చుతో సుబ్బిరామిరెడ్డి ఈ వేడుక నిర్వమిస్తున్నారు.

50వేల మందితో

50వేల మందితో

ఈ వేడుక గురించి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఎన్నడూ జరుగనంత గ్రాండ్ గా ఈ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. సాధారణంగా సినిమా ఫంక్షన్లు ఆడిటోరియం లేదా క్లోజ్డ్ హాల్స్ లో జరుగుతుంటాయి. తొలాసారిగా ఈ వేడుకను ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నాం. 50వేల మంది ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

 కమర్షిల్ ఉద్దేశం లేదు

కమర్షిల్ ఉద్దేశం లేదు

ఇతర సినిమా అవార్డులకు భిన్నంగా టీఎస్ఆర్ పిల్మ్ అవార్డ్స్ ఉంటాయి. ఈ వేడుక నేను సొంతగా నిర్వహిస్తున్నాను. ఎలాంటి స్పాన్సర్లు లేరు. అవార్డుల వేడుకలో ఎలాంటి కమర్షియల్ ప్రాసెస్ లేదు. 9 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ద్వారా అవార్డులకు నటీనటుల ఎంపిక జరుగుతుంది అని టీఎస్ఆర్ తెలిపారు.

60 మంది స్టార్స్

60 మంది స్టార్స్

తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళ సినీ పరిశ్రమ నుండి స్టార్స్ వస్తున్నారు. మొత్తం 60 మంది వరకు స్టార్స్ ఈ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొంటారు అని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

English summary
The recipients of TSR-TV9 National Film Awards for the year 2015 and 2016 have been announced. The awards ceremony is going to happen at an open area in Visakhapatnam. As many as 50,000 people are expected to attend the event to be participated by galaxy of stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu