»   » టీఎస్ఆర్ సినీ అవార్డ్స్... చిరు, బాలయ్య, నాగార్జున సందడి (ఫోటోస్)

టీఎస్ఆర్ సినీ అవార్డ్స్... చిరు, బాలయ్య, నాగార్జున సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: టి.సుబ్బరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్‌ తరుపున తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర రంగాల్లో 2015, 2016 సంవత్సరాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డుల ప్రధానోత్సవం విశాఖలో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

  తెలుగు, హిందీ, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు ప్రముఖ తారలంతా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేసారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో ఈ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది.

  కళాకారుల్ని గౌరవిస్తే ఈశ్వరుడ్ని పూజించినట్టే

  కళాకారుల్ని గౌరవిస్తే ఈశ్వరుడ్ని పూజించినట్టే

  ప్రతి ఏటా ఇలా అవార్డుల సంబరాలుంటాయని టి సుబ్బిరామిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసారు. . ‘‘నాకు కళలన్నా, కళాకారులన్నా గౌరవం. కళాకారుల్ని గౌరవిస్తే ఈశ్వరుడ్ని పూజించినట్టే. అందుకే ప్రతీయేటా ఇలా అవార్డులు ఇస్తుంటాని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

  మెగాస్టార్ చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి

  ‘‘ఉత్తరాది, దక్షణాది సినీ ప్రముఖుల్ని ఇంత ఘనంగా సత్కరించడం సుబ్బిరామిరెడ్డిగారికే చెల్లింది. ఆయనకు కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం... ఇలాంటి కళాభిమానం ఉన్న వ్యక్తి ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు చిరంజీవి.

  బాలయ్య

  బాలయ్య

  బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘విశాఖ నగరంతో నాకెంతో అనుబంధం ఉంది. నా సినిమాలెన్నో ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఇలాంటి అవార్డులు మరిన్ని మంచి చిత్రాల్ని అందించాలన్న స్ఫూర్తి అందిస్తాయని తెలిపారు. 2016 సంవత్సరానికి గాను బాలయ్య డిక్టేటర్ చిత్రానికి ఉత్తమ కథానాయకుడు అవార్డు అందుకున్నారు.

  అవన్నీ నమ్మొద్దు

  అవన్నీ నమ్మొద్దు

  ‘‘బాలకృష్ణకూ నాకూ ఏవో గొడవలు ఉన్నాయంటూ పిచ్చి పిచ్చి రూమర్లున్నాయి. అలాంటివేం లేవు. మేమిద్దరం మంచి మిత్రులం'' అని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకుగాను నాగార్జున ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

  మోహన్ బాబు

  మోహన్ బాబు

  ‘‘శ్రీకృష్ణదేవరాయుల వారు అప్పట్లో కళల్ని, కళాకారుల్ని గౌరవిస్తారని చదువుకొన్నాం. అలా సుబ్బిరామిరెడ్డి కళల్ని ప్రోత్సహిస్తున్నారు... అని మోహన్‌బాబు అన్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డు కింద మోహన్ బాబు 4డికేడ్స్‌ స్టార్‌ అవార్డు అందుకున్నారు.

  2015 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

  2015 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

  1) ఉత్తమ నటుడు- వెంకటేష్‌(గోపాల గోపాల)
  2. ఉత్తమ కథానాయకుడు- అల్లు అర్జున్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)
  3) బెస్ట్‌ ఔట్‌స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు- అల్లు అర్జున్‌ (రుద్రమదేవి)
  4) ఉత్తమ నటి- శ్రియ (గోపాల గోపాల)
  5) ఉత్తమ కథానాయిక- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (బ్రూస్‌లీ, పండగ చేస్కో)
  6) బెస్ట్‌ డెబిట్‌ హీరో- ఆకాష్‌ పూరి (ఆంధ్రా పోరి)
  7) బెస్ట్‌ డెబట్‌ హీరోయిన్‌- ప్రగ్యా జైశ్వాల్‌ (కంచె)
  8) ఉత్తమ దర్శకుడు- గుణశేఖర్‌ (రుద్రమదేవి)
  9) ఉత్తమ చిత్రం- కంచె
  10) ఉత్తమ ప్రతినాయకుడు- ముఖేష్‌రుషి (శ్రీమంతుడు)
  11) బెస్ట్‌ క్యారక్టర్‌ యాక్టర్‌ (మహిళ)- నదియా (బ్రూస్‌లీ)
  12) ఉత్తమ కమెడియన్‌- అలీ (సన్నాఫ్‌ సత్యమూర్తి)
  13) ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీ ప్రసాద్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)
  14) ఉత్తమ నేపథ్య గాయకుడు- దేవీశ్రీ ప్రసాద్‌ (సూపర్‌ మచ్చీ- సన్నాఫ్‌ సత్యమూర్తి)
  15) ఉత్తమ నేపథ్య గాయని- యామిని (మమతల తల్లి6 బాహుబలి)

  2016 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

  2016 సంవత్సరానికి గాను విజేతల వివరాలు

  1) ఉత్తమ కథానాయకుడు- నందమూరి బాలకృష్ణ (డిక్టేటర్‌)
  2) ఉత్తమ నటుడు- అక్కినేని నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా)
  3) స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు- రామ్‌చరణ్‌ (ధృవ)
  4) స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ ఫర్‌ పాపులర్‌ ఛాయిస్‌- నాని (జెంటిల్‌మేన్‌)
  5) ఉత్తమ నటి- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (ధృవ, నాన్నకు ప్రేమతో)
  6) ఉత్తమ కథానాయిక- క్యాథరీన్‌ ట్రెసా (సరైనోడు)
  7) బెస్ట్‌ డెబట్‌ కథానాయిక- నివేదా థామస్‌ (జెంటిల్‌మేన్‌)
  8) ఉత్తమ దర్శకుడు- సురేందర్‌రెడ్డి (ధృవ)
  9) ఉత్తమ చిత్రం- వూపిరి
  10) ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (బాబు బంగారం)
  11) ఉత్తమ సంగీత దర్శకుడు- ఎస్‌ఎస్‌ థమన్‌ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు)
  12) ఉత్తమ నేపథ్య గాయకుడు- శ్రీకృష్ణ (జెంటిల్‌మేన్‌)
  13) ఉత్తమ నేపథ్య గాయని- ప్రణవి (జెంటిల్‌మేన్‌- గుసగుసలాడే)

  జ్యూరీ అవార్డ్స్‌ డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ ఫర్‌ ది ఇయర్స్‌- 2015, 2016

  జ్యూరీ అవార్డ్స్‌ డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ ఫర్‌ ది ఇయర్స్‌- 2015, 2016

  1). నేషనల్‌ స్టార్‌ అవార్డు- ప్రభాస్‌ (బాహుబలి)
  2). స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌- రానా (బాహుబలి)
  3). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- మాస్‌ ఎంటర్‌టైనర్‌- కళ్యాణ్‌రామ్‌ (పటాస్‌)
  4). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమనటి- మంచు లక్ష్మీ (దొంగాట)
  5). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ కథానాయిక- హెబ్బా పటేల్‌ (కుమారి 21ఎఫ్‌)
  6). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ దర్శకుడు- క్రిష్‌ (కంచె)
  7). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- ఉత్తమ సంగీత దర్శకుడు- మణిశర్మ (ఎన్‌బీకే లయన్‌)
  8). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- గాయకుడు- సింహ (దిమ్మతిరిగే.. శ్రీమంతుడు)
  9). స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డ్‌- నాగచైతన్య (ప్రేమమ్‌)
  10). స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ ఉత్తమ దర్శకుడు- ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్‌మేన్‌)
  11). బెస్ట్‌ ఆల్‌రౌండ్‌ యాక్టర్‌- రాజేంద్రప్రసాద్‌ (నాన్నకు ప్రేమతో)
  12). స్పెషల్‌ అప్రిసియేషన్‌ యాక్టర్‌ అవార్డు- శర్వానంద్‌ (ఎక్స్‌ప్రెస్‌ రాజా)
  13). స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డు- నారా రోహిత్‌ (జో అచ్యుతానంద)
  14). బెస్ట్‌ ప్రామిసింగ్‌ హీరో- విజయ్‌ దేవరకొండ (పెళ్లిచూపులు)
  15). బెస్ట్‌ ప్రొగ్రెసివ్‌ ఫిలిం- పెళ్లి చూపులు
  16). బెస్ట్‌ అప్‌కమింగ్‌ యాక్టర్‌- దీపక్‌ సరోజ్‌ (మిణుగురులు)
  17). ఉత్తమ బాలనటుడు- మాస్టర్‌ ఎన్‌టీఆర్‌ (గ్రాండ్‌ సన్‌ ఆఫ్‌ ఎన్‌టీఆర్‌- దానవీరశూరకర్ణ)
  18). ఉత్తమ బాలల చిత్రం- దానవీరశూరకర్ణ
  19). స్పెషల్‌ అప్రిసియేషన్‌ డైరెక్టర్‌ అవార్డు- నాగ అశ్విన్‌ (ఎవడే సుబ్రమణ్యం)
  20). స్పెషల్‌ అప్రిసియేషన్‌ డైరెక్టర్‌ అవార్డు- బాబ్జీ (రఘుపతి వెంకయ్య)
  21). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- నేపథ్య గాయని- సమీర (తెలుసా తెలుసా.. సరైనోడు)
  22). ఉత్తమ నటుడు (తమిళం)- మాధవన్‌
  23). ఉత్తమనటి (తమిళం)- హన్సిక
  24). ఉత్తమనటి (కన్నడ)- ప్రియమణి
  25). బెస్ట్‌ డెబట్‌ యాక్టర్‌ (కన్నడ)- నిఖిల్‌ గౌడ
  26). బెస్ట్‌ ప్రామిసింగ్‌ నటి (హిందీ)- సోనాలీ చౌహాన్‌
  27). బెస్ట్‌ ప్రామిసింగ్‌ నటి (హిందీ)- వూర్వశి రౌటెల

  స్పెషల్‌ జ్యూరీ అవార్డ్సు డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ

  స్పెషల్‌ జ్యూరీ అవార్డ్సు డిసైడెడ్‌ బై ది జ్యూరీ కమిటీ

  1). మిలినీయం స్టార్‌ అవార్డు- కథానాయకుడు- శతృఘన్‌ సిన్హా
  2). మిలినీయం స్టార్‌ అవార్డు- కథానాయిక- హేమా మాలిని
  3). సెన్సేషనల్‌ స్టార్‌ అవార్డు- జాకీ ష్రాఫ్‌
  4). 5డికేడ్స్‌ స్టార్‌ అవార్డు- కృష్ణంరాజు
  5). 4డికేడ్స్‌ స్టార్‌ అవార్డు- మోహన్‌బాబు
  6). లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు- బప్పీలహరి(సంగీత దర్శకుడు)
  7). స్పెషల్‌ జ్యూరీ అవార్డు- రేవంత్‌ (ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌)

  English summary
  Tollywood Mega Star Chiranjeevi said that he never misses coming to the Visakhapatnam city. The actor defended his statement saying that it is the city people who encourage him very much. Addressing at TSR-TV9 National Film Awards function at Port Stadium in the Visakha city, the actor said it is not TSR but the people of the city who welcome him in a more humble manner. Chiranjeevi has highlighted in a hilarious manner how he was forced to join the function organized by T Subbarami Reddy. Watch the video for more updates.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more