twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవార్డుల పంట: మహానటికి ఆరు.. రంగస్థలంకు నాలుగు.. బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవికి

    |

    టీఎస్‌ఆర్‌, టీవీ9 సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ అవార్డుల్లో రంగస్థలం, మహానటి చిత్రాలు తమ హవాను కొనసాగించాయి, 2017, 2018 సంవత్సరానికి గానూ అవార్డుల కమిటీ విజేతలను ప్రకటించింది. ఫిబ్రవరి 17న విశాఖపట్నంలో జరిగే అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 2017, 2018 సంవత్సరాలకు గాను విజేతల పేర్లను అవార్డుల కమిటీ చైర్మన్ టీ సుబ్బిరామిరెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు డా.శోభన కామినేని, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే..

    నాలుగు సంవత్సరాలుగా

    నాలుగు సంవత్సరాలుగా

    టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. ఆదివారం విశాఖపట్నంలో జరిగే వేడుకలో పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నాం. ప్రజలు, సినీ అభిమానుల నుంచి సేకరించిన అభిప్రాయల మేరకు అవార్డులను అందజేస్తున్నాం అని అన్నారు.

    నిష్పక్షపాతంగా అవార్డుల ఎంపిక

    నిష్పక్షపాతంగా అవార్డుల ఎంపిక

    మహానటి, రంగస్థలం, గౌతమిపుత్ర శాతకర్ణి.. లాంటి మంచి చిత్రాలు పురస్కారాలకు ఎంపికయ్యాయి. శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరిట కూడా అవార్డుల్ని ఇస్తున్నాం. హిందీ, తమిళ, కన్నడ, భోజ్‌పురి, పంజాబీ చిత్రాల్నీ గౌరవిస్తున్నాం. నిష్పక్షపాతంగా, ఎలాంటి వివాదం లేకుండా అవార్డులను అందజేస్తున్నాం అని టీఎస్సార్ అన్నారు.

     బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవికి అవార్డులు

    బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవికి అవార్డులు

    ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ, నాగార్జునలకు టీఎస్‌ఆర్‌ జాతీయ అవార్డులు ప్రకటించారు. 2017 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి), 2018 సంవత్సరానికి గానూ నాగార్జున (దేవదాస్‌) ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు. పాపులర్ అవార్డుల కేటగిరిలో చిరంజీవికి ఉత్తమ హీరో అవార్డు దక్కింది. ఖైదీ నంబర్ 150 చిత్రానికి మెగాస్టార్ ఈ అవార్డు వచ్చింది.

     విద్యాబాలన్‌కు స్వర్గీయ శ్రీదేవి అవార్డు

    విద్యాబాలన్‌కు స్వర్గీయ శ్రీదేవి అవార్డు

    నేషనల్ స్టార్ శ్రీదేవి స్మారక పురస్కారం విలక్షణ నటి విద్యాబాలన్‌కు, స్వర్గీయ దాసరి నారాయణరావు స్మారక పురస్కారం మోహన్‌బాబుకు, స్టార్ ప్రొడ్యూసర్ అవార్డు బోనికపూర్‌కు, ‘అవుట్‌స్టాండింగ్‌ సినీ లిరిక్‌ రైటర్‌' అవార్డుని సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రకటించారు. లైఫ్ టైమ్ అవార్డు నగ్మాకు దక్కింది.

     విజేతలు వీళ్లే..

    విజేతలు వీళ్లే..

    2018కి ఉత్తమ కథానాయకుడిగా రాంచరణ్‌ (రంగస్థలం), ఉత్తమ నటి కీర్తి సురేష్‌ (మహానటి), ఉత్తమ కథానాయిక పూజా హెగ్డే (అరవింద సమేత వీర రాఘవ), 2017కి ఉత్తమ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (రారండోయ్‌ వేడుక చూద్దాం), ఉత్తమ కథానాయిక రాశీఖన్నా (జై లవకుశ) ఎంపికయ్యారు. షాలినీపాండే, రాజేంద్రప్రసాద్‌, వీవీ వినాయక్‌, క్రిష్‌, సుకుమార్‌, రాజశేఖర్‌, అఖిల్‌, నాగచైతన్య, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, ఆది పినిశెట్టి, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, కల్యాణ్‌దేవ్‌, అలీ, బి.జయ, బోనీకపూర్‌లకు పలు విభాగాలలో అవార్డులు దక్కాయి.

    English summary
    T Subbirami Reddy, Chairman of TSR Lalithakala Parishath has announced the results of TSR-TV9 National Film Awards for the 2017, 2018. Bala Krishna, Nagarjuna, Chiranjeevi gets awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X