»   » చూసి బ్లూఫిలింలాగ ఉందంటున్నారు.. (సాంగ్ వీడియో)

చూసి బ్లూఫిలింలాగ ఉందంటున్నారు.. (సాంగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సెక్స్ సాంగ్ తో ఎట్రాక్ట్ చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులను థియోటర్ కు లాగవచ్చు అనేది బాలీవుడ్ మీడియం సినిమా నిర్మాతల స్ట్రాటజీ. అందులో భాగంగానే ఇప్పుడు రెడీ అవుతున్న చిత్రం హేట్ స్టోరీ-3. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ సాంగ్ వీడియో రిలీజ్ చేసారు. మీరూ ఓ లుక్కేయండి.

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ ఎరోటిక్ మూవీ సిరీస్ హేట్ స్టోరీ. సినిమాలో పెద్దగా కంటెంట్ ఏమి ఉండదు...ఓ అమ్మాయిని ఒక విలన్ మోసం చేస్తే ఆ అమ్మాయి ఎలా తన అందాన్ని పణంగా పెట్టి ఆ విలన్ పై ప్రతీకారం తీర్చుకుంటుందో చూపిస్తారు. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అవ్వగా రెండవ మూవీ మాత్రం ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత హాట్ సీన్స్ లేవని కంప్లైంట్ వచ్చి యావరేజ్ గా నిలిచింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పుడు ముచ్చటగా మూడో పార్ట్ తో రాబోతున్న నిర్మాతలు సల్మాన్ ఖాన్ లాంచ్ చేసిన ఫేల్యూర్ హీరోయిన్స్ జరైన్ ఖాన్ మరియు డేసి శాల అందాలను నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూసిన వాళ్ళు ఇది నిజంగా సెగలు పుట్టించే సినిమా అవుతుందని ఆశిస్తున్నారు.

కత్రినాకైఫ్ పోలికలు అచ్చుకొట్టినట్లు ఉండే జరైన్ ఖాన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి హాట్ హాట్ సన్నివేశాలతో సినిమా మొత్తం ఎరోటిక్ గా కనిపిస్తుందని చెబుతున్నారు. త్వరలోనే హేట్ స్టోరీ లవర్స్ కోసం ఫస్ట్ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారట. దానికంటే ముందు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాకు కావాల్సింత హైప్ ని తీసుకొచ్చేశారు.

కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని తారా స్థాయిలో పండించింది. ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో 'హేట్ స్టోరీ 2' చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జరీన్ ఖాన్ హద్దులు దాటి రోమాన్స్ చేసేసింది. షర్మాన్ జోషి, కరణ్ సింగ్ మధ్య కూడా హాట్ సీన్స్. ట్రైలరే ఇంత హీట్ పుట్టిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం డిసెంబర్ 4 రిలీజ్ కానుంది.

English summary
Presenting "Tu Isaq Mera" VIDEO Song in the voice of Meet Bros ft. Neha Kakkar from Hate Story 3 starring Zareen Khan, Sharman Joshi, Daisy Shah & Karan Singh in lead roles exclusively on T-Series.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu