సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ ఫస్ట్ లుక్ ఇదే
సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ట్యూబ్ లైట్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'ట్యూబ్ లైట్' ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. హిస్టారికల్ వార్ నేపథ్యంలో సాగే ఈ సినిమా 1962 లో జరిగిన చైనా ఇండియా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ చైనా అమ్మాయి ప్రేమలో పడే యువకుడిగా నటిస్తున్నాడు.
హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన చైనా హీరోయిన్ జూజూ నటిస్తుంది. ప్రీతమ్ మ్యూజిక్ అందించారు. 2017 ఈద్ సందర్భంగా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
భారత్‌కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ కబీర్ ఖాన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











