»   » తెలుగు దర్శకుడు డైరక్ట్ చేసారు.. రిలీజై 14 ఏళ్లైనా ఇంకా ఆడుతోంది

తెలుగు దర్శకుడు డైరక్ట్ చేసారు.. రిలీజై 14 ఏళ్లైనా ఇంకా ఆడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: జెనీలియా తొలి చిత్రం 'తుఝే మేరీ కసమ్‌' వచ్చి 14 సంవత్సరాలు అవుతోంది. 2003లో విడుదలైన ఈ చిత్రంలో జెనీలియా..భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌, శ్రియాలతో కలిసి నటించింది.2000 సంవత్సరంలో తెలుగులో వచ్చిన 'నువ్వేకావాలి' సినిమాకి రీమేక్‌గా వచ్చింది.

ఇప్పుడు హఠాత్తుగా ఈ చిత్రం గురించి టాపిక్ ఏమిటీ అంటే.. ఈ చిత్రం 14 ఏళ్లు కావొస్తున్నా మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతంలోని ఓ థియేటర్లలో ఇంకా ఆడుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు విజయ్ భాస్కర్ డైరక్ట్ చేసారు. ఈ విషయాన్ని రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ ఫొటో పోస్ట్‌ చేశాడు.

'నువ్వేకావాలి' సినిమాకు రీమేక్ గా తీసిన 'తుఝే మేరీ కసమ్' సినిమా ద్వారా జెనీలియా, రితేష్ లు తొలిసారి బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు. ఆ పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వైభవంగా వివాహం చేసుకున్నారు.

అనోన్యమైన జంటగా వీరికి మంచి పేరుంది కూడా. ఇద్దరు పిల్లల తల్లి అయిన జెనీలియా వెండితెరకు తాత్కాలికంగా దూరమయ్యారు. పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆమె తిరిగి వెండితెరపై మెరవాలనే అభిమానుల ఆశ త్వరలో నెరవేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు తాజాగా విడుదలైన శివాయ్‌, యే దిల్‌ హై ముష్కిల్‌, ప్రియాంక చోప్రా నిర్మించిన మరాఠీ చిత్రం 'వెంటిలేటర్‌' ఆడుతుండడం విశేషం. ఈ సినిమానే కాకుండా 1995లో షారుక్‌, కాజోల్‌లు నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమా ఇప్పటికీ ముంబయిలోని మరాఠా మందిర్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.

English summary
Riteish Deshmukh tweeted: Tujhe Meri Kasam - Our debut film playing in the theatres along with the latest releases in Maharashtra (Nanded) #14thYear #ThankYou #Love. Tujhe Meri Kasam, the movie Riteish Deshmukh debuted with, is very close to his heart for more than the obvious reasons. Despite for the fact that he is more known for his roles in sex comedies like Masti and Kya Kool Hain Hum. For, the actor met his future wife, Genelia D'Souza on the sets of this movie only.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu