హాట్‌హాట్‌గా తూనీగ తూనీగ పిల్ల.. దుమ్మురేపుతున్న ఫొటోలు..
తూనీగ తూనీగ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రియా చక్రవర్తి వెండితెర మీద సందడి చేయడం మానేసి సోషల్ మీడియాలో నెటిజన్లను వెర్రెక్కిస్తున్నది.
తూనీగ తూనీగ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రియా చక్రవర్తి వెండితెర మీద సందడి చేయడం మానేసి సోషల్ మీడియాలో నెటిజన్లను వెర్రెక్కిస్తున్నది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఎంఎస్ రాజు డైరెక్షన్‌లో సుమంత్ సరసన
తూనీగ తూనీగ చిత్రంతో రియా చక్రవర్తి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ పక్కన హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం అంతగా విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మేరే డాడ్ కీ మారుతీ అనే హిందీ చిత్రంలో నటించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్
ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో కనిపించిన దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. పలు దఫాలుగా రియా చక్రవర్తి పోస్ట్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొన్నాయి.

తాజా ఫొటోషూట్‌తో రియా హల్‌చల్
బాలీవుడ్ తెరపై సొనాలీ కేబుల్ అనే చిత్రం తర్వాత రియా మళ్లీ ఎక్కడ కనిపించలేదు. కానీ తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ సంచలనం రేపింది. గతంలో పొరుగింటి అమ్మాయి ఇమేజ్ వదిలేసి గ్లామర్ తో హల్‌చల్ చేసి పరిశ్రమ వర్గాలను ఆకర్షించింది.



Click it and Unblock the Notifications











