»   » రక్తం మరకలు: తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై అనుమానాలు?

రక్తం మరకలు: తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై అనుమానాలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టీవీ నటుడు ప్రదీప్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి పీఎస్ పరిధి పుప్పాలగూడలో ఉంటున్న ప్రదీప్ ఇక్కడి తన గ్రీన్ హోమ్స్ అపార్టుమెంటులో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో తెల్లవారు ఝామున 4 గటలకు ఉరి వేసుకున్నాడు.

సప్తమాత్రిక అనే సీరియల్ లో ప్రదీప్ హీరోగా నటించాడు. ఇటీవలే టెలివిజన్ నటి పావని రెడ్డిని ప్రదీప్ వివాహం చేసుకున్నాడు. సంతోషంగా సాగుతున్న ప్రదీప్.... ఆత్మహత్య చేసుకునేంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

ప్రదీప్ రాత్రి 12 గంటల తర్వాత ఏదో పార్టీకి వెళ్లి వచ్చి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడని ప్రదీప్ భార్య పావని అంటోంది. అయితే ఆత్మహత్య చేసుకుంటే రక్తపు మరకలు ఎలా వచ్చాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం రిపోర్టు తర్వాతే ఏ విషయం అనేది చెబుతామని అంటున్నారు పోలీసులు.

పోలీసులు అనుమానాలు

పోలీసులు అనుమానాలు

పోలీసులు ఈకేసును వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ప్రదీప్ కు అప్పులు, ఆర్థిక సమస్యలేమీ లేవని తెలుస్తోంది. ఏదో కారణంతో మానసికంగా కృంగి పోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.

కుటుంబ కలహాలా?

కుటుంబ కలహాలా?

ప్రదీప్ కుమార్ కు కుటుంబ పరంగా కలహాలు ఏమైనా ఉన్నానా? తన భార్య పావని రెడ్డితో రిలేషన్ ఎలా ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

పావని రెడ్డిని ప్రదీప్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ టీవీ రంగానికి చెందిన వారే అని, ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

కెరీర్ పరంగా

కెరీర్ పరంగా

టీవీ రంగంలో కెరీర్ పరంగా ప్రదీప్, పావని రెడ్డిలు సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ రెడ్డి సప్తమాత్రిక సినిమాలో నటిస్తుండగా, పావని అగ్రిపూలు అనే సీరియల్ లో నటించింది.

English summary
Popular television actor Pradeep's reportedly committed suicide on wednessday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu