వ్యభిచార వృత్తిలోకి దించుకున్న టీవీ నటి అరెస్టు
బెంగళూరు: బ్యూటీపార్లర్‌లో ఉద్యోగాల పేరిట యువతులకు ఆశ చూపించి పడుపు వృత్తిలోకి దించుతున్న బుల్లి తెర నటిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువతుల్ని నగరానికి పిలిపించుకుని ఆమె పడుపు వృత్తిలోకి దించుతున్నట్లు గుర్తించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
బుల్లి తెరలో వేర్వేరు ధారావాహికల్లో నటించే ఆమె పరిశ్రమలో తనకు పరిచయం ఉన్న వారిని ఇంటికి పిలిపించి తన వద్ద ఉన్న యువతులతో పడుపు వృత్తి చేయించేది. విజయనగర పరిధి గోవిందరాజనగరలోని ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
ఆమె అదుపులో ఉన్న తుమకూరుకు చెందిన ఒక యువతిని రక్షించారు. ఆమె వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ తీవ్రం చేశామని పోలీసులు తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతల్ని విజయనగర ఠాణా పోలీసులకు అప్పగించారు.


Click it and Unblock the Notifications











