»   » దొంగతనం కేసులో టీవీ నటి అరెస్టు

దొంగతనం కేసులో టీవీ నటి అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu
TV artist held for house theft
బెంగళూరు: స్నేహితురాలి ఇంట్లో చోరీకి పాల్పడ్డ టీవీ సీరియల్‌ నటి సుజాతను రాజరాజేశ్వరినగర పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మాంగల్యం, రంగోలి తదితర టీవీ సీరియల్స్‌లో నటించింది. ఆమె తన స్నేహితురాలు టీవీ నటి కవనా ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కవనా-సుజాత మంచి స్నేహితులు.

ఇద్దరూ కలిసి అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. గత ఏడాది అనారోగ్యం పాలైన కవనా ఇంట్లో కొద్ది రోజులు సుజాత ఉంది. ఈ సమయంలో రూ.1.75లక్షల విలువ చేసే బంగారు నగలను దొంగిలించినట్లు కవనా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

English summary
Sujatha, alias Nagalakshmi, 40, a television serial actress out on bail, was arrested by Rajarajeshwarinagar police in a theft case. She has acted in serials Mangalya and Rangoli and Kannada film Matha. Her friend Kavitha, whom the police suspect is also involved, is at large.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu