హీరోగా మారిన...‘మొగిలి రేకులు’ సాగర్
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత మాట్లాడుతూ- ఈ సినిమా చూస్తుంటే అప్పట్లో రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుందని, మొగలి రేకుల ద్వారా మంచి నటుడిగా గుర్తింపు పొందిన సాగర్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు.
దర్శకుడు అరుణ్‌ప్రసాద్ మాట్లాడుతూ- అద్భుతమైన ఈ కథను నిర్మాత కుమార్తె అందించారని, రాజేంద్రప్రసాద్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. కథ బాగా నచ్చి ఈ చిత్రాన్ని చేస్తున్నానని, షూటింగ్‌లో పాత రోజులు గుర్తుకువస్తున్నాయని, సెట్‌లో అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ కన్పిస్తున్నాయని, తప్పక ఈ చిత్రం విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందని కథానాయకుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.
గిరిబాబు, జె.పి., ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జాన్ కొక్కెర, హేమ, రాఘవ, చంటి, సుభాషిణి, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:చిన్ని చరణ్, కెమెరా: జశ్వంత్, కథ, స్క్రీన్‌ప్లే:మాధురి మాధవి, మాటలు: చందు, నిర్మాత: బి.సత్యనారాయణ, దర్శకత్వం: పి.వి. అరుణ్‌ప్రసాద్.


Click it and Unblock the Notifications












