»   » నా భర్తను చూస్తోంటే వెన్నులో వణుకు పుడుతోంది : భర్త పై ట్వింకిల్ కన్నా ట్వీట్

నా భర్తను చూస్తోంటే వెన్నులో వణుకు పుడుతోంది : భర్త పై ట్వింకిల్ కన్నా ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కుతోందనీ, ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నాడనీ తెలిసిందే కదా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.రోబోలో బోరా అనే సైంటిస్ట్ విలన్ గా చేస్తే, ఈ పార్ట్ లో సైంటిస్ట్ గా అక్షయ్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వం, రజినీకాంత్ లీడ్ రోల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలనిజం వెరసి ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. బాలీవుడ్‌లో స్టంట్స్‌కి పెట్టింది పేరైన హీరో అక్షయ్ కుమార్. అటువంటి స్టార్ హీరో ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేయడానికి అంగీకరించాడంటే మరి రజినీ హీరోయిజంని ఇంకా ఏ రేంజ్‌లో చూపించాల్సి వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైనపనేమీ కాదు.

 Twinkle Khanna’s response to Akshay Kumar’s evil avatar in '2.0' is Epic

పెద్దగా కనుబొమ్మలు, జర్కీన్ తో అక్షయ్ కుమార్ గెటప్ తెగ హల్ చల్ చేస్తోంది. చూడ టానికి కాకిలాగా వింతగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. గతంలో విక్రం హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు క్లైమాక్స్ సన్నివేశం ఓ స్టేడియం లో జరుగుతుంది. వేలాది మంది ఆడియన్స్ మధ్య... ఈ ఫోటో చూస్తుంటే అదే గుర్తుకు వస్తోంది. నిప్పుకణికల్లా రగిలే కళ్లు, పెద్దపెద్ద గోర్లు, భయానికే భయం పుట్టించే ఆకారంతో (రోబో)2.0లో విలన్ గా కనిపిస్తోన్న అక్షయ్‌ కుమార్‌ గెటప్ చూసి ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బెదిరిపోయిందట!

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొంతుతోన్న రోబో 2.0కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. రజనీ వశీకర్ పాత్రలో కొనసాగుతుండగా, అక్షయ్ 'క్రౌమ్యాన్‌'గా తలపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఫస్ట్ లుక్‌తో రెట్టింపయ్యాయి. 2.0లో రజనీ, అక్షయ్ ల గెటప్ లపై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చలు జరుగుతుండగానే అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ '15 ఏళ్ల తర్వాత కూడా మా ఆయన నా వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు' అని ట్విట్టర్‌ కామెంట్‌ పోస్ట్‌ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ పాత్ర పురాణాల్లోని రాక్షసుడిలా ఉందని ఆమె పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి (త్రీడీలో) విడుదల చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు.

English summary
Twinkle took to Twitter Monday morning to express her take on Akshay kumar’s 2.0 devilish avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu