»   » నా కూతురు కట్టప్ప.. నా భార్త కంటే ఎక్కువగా వేధిస్తుంది.. ప్రముఖ నటి కామెంట్స్..

నా కూతురు కట్టప్ప.. నా భార్త కంటే ఎక్కువగా వేధిస్తుంది.. ప్రముఖ నటి కామెంట్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా.. సామాన్యుల నుంచి సెలబ్రీటల వరకు బాహుబలి2 సినిమాను చూసి ఫిదా అవుతున్నారు. కట్టప్ప పాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. కట్టప్ప అభిమానుల జాబితాలో ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా, నటి ట్వింకిల్ ఖన్నా చేరిపోయారు. అక్షయ్ ఖన్నా దంపతులు ఇటీవల బాహుబలి2 సినిమాను కుటుంబ సమేతంగా చూశారు. అనంతరం ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అదేమిటంటే..

కూతురును నితారా..

కూతురును నితారా..

నేను బాహుబలి2 సినిమాను చూశాను. ఆ తర్వాత నా కూతురు నితారాను కట్టప్ప అని పిలువడం ప్రారంభించాను. ఎందుకంటే తండ్రి అక్షయ్ కంటే నితారానే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే అలాకాకుండా నితారాను రౌడీ అని పిలువమని అక్షయ్ సూచించాడు అని ట్వింకిల్ ట్వీట్ చేసింది.


చాలా ఇంప్రెస్ అయ్యాను..

చాలా ఇంప్రెస్ అయ్యాను..

ఇది పక్కన పెడితే బాహుబలి సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. కట్టప్ప పాత్ర బాగుంది. ఇప్పుడు కట్టప్ప అంటే చాలా ఇష్టం ఏర్పడింది. కట్టప్ప నా స్నేహితుడు అని మరో ట్వీట్‌లో పేర్కొన్నది. అంతేకాకుండా ఇన్స్‌స్టాగ్రామ్‌లో కట్టప్ప ఫోటోను పోస్ట్ చేసింది.


నటనకు స్వస్తి..

నటనకు స్వస్తి..

నటిగా మంచి జోరు మీద ఉండగానే ట్వింకిల్ ఖన్నా నటుడు అక్షయ్ కుమార్‌ను పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో ఆమె నటనకు దూరమైంది. తెలుగులో వెంకటేశ్ సరసన శీను చిత్రంలో నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ఆరవ్, కూతురు నితారా వారి సంతానం.


జాతీయ ఉత్తమ నటుడిగా..

జాతీయ ఉత్తమ నటుడిగా..

రుస్తుం చిత్రంలో నటనకు గాను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ జాతీయ నటుడు అవార్డుతో సత్కరించింది. ఇటీవల ఆయన నటించిన చిత్రం జాలీ ఎల్ఎల్బీ2 సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఓ టాలీవుడ్ నిర్మాత హక్కులను సొంతం చేసుకొన్నాడు. ఈ చిత్రంలో వెంకటేశ్ గానీ, పవన్ కల్యాణ్ గానీ నటించే అవకాశం ఉంది.English summary
Actress Twinkle Khanna is so impressed by Kattappa that she has even started calling her daughter Kattappa. She said, "Saw Baahubali and I've been calling my daughter Kattappa much to her dad's annoyance-Perhaps he would prefer her being called Rowdy instead:)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu