twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక పాత్ర తో తెలుగులో రెండు చిత్రాలు!

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రయోగాలు టాలీవుడ్ లో చాలా తక్కువనే చెప్పాలి. అందులోనూ ఒకే పాత్రతో తీసే సినిమాలు మరీ అరుదు. అయితే అటువంటి ఫీట్ తో రెండు సినిమాలు ఒకేసారి రెడీ అవుతున్నాయి. ఆ ప్రాజెక్టులకు క్రేజ్ వస్తుందా లేదా అనేదాని కన్నా చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కే ఈ చిత్రాలు ప్రయోగం కాబట్టి బిజినెస్ బాగానే అయ్యే అవకాసాలు ఉంటాయి. వాటి వివరాలేంటో చూద్దాం.

    ఆ చిత్రాల్లో ఆకాష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం పేరు... '100'. రాహుల్‌సింగ్‌ ఖగ్వాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా త్యాగి, అనితాసింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఒకే ఒక్క పాత్రతో రూపొందుతున్న చిత్రమిది. ఆకాష్‌ చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. రెండు గంటలకిపైగా నిడివి వున్న ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు, పదిహేను పాత్రల తాలూకు గొంతులు వినిపిస్తుంటాయి. ఆ ఒక్క పాత్రకీ, 100 అనే సినిమా పేరుకీ సంబంధమేమిటన్నది తెరపైనే చూడాలి. సిద్ధార్థ్‌ నాయుడు రాసిన సంభాషణలు చిత్రానికి బలాన్నిస్తాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము'' అన్నారు.

    ఇకో మరో చిత్రం అర్చన ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం 'పంచమి'. సుజాత భౌర్య దర్శకురాలు. డి.శ్రీకాంత్‌ నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రం, లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. సినిమా వెబ్‌సైట్‌ని సాగర్‌ ఆవిష్కరించారు. ప్రచార చిత్రాన్ని టి. ప్రసన్నకుమార్‌ ఆవిష్కరించారు.

    'ఒకే పాత్రతో వస్తోన్న ఈ సినిమా తీయడం తెలుగుకు కొత్త. ఈ ప్రయత్నం విజయవంతమవుతుంద''న్నారు ప్రసన్నకుమార్‌.''ఫొటోలు తీయడానికి అడవిలోకి వెళ్లిన ఓ అమ్మాయికి అక్కడ ఎదురైన సంఘటనలు.. వాటిని ఎదుర్కోనేందుకు ఆమె చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. ఒక్క పాత్రతోనే సినిమా తెరకెక్కించడం.. ఆ పాత్ర నాదే కావడం కొత్తగా ఉంద''న్నారు అర్చన. ''ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా రూపొందించాం. అడవిలో భయంకరమైన ప్రాంతాల్లో డూప్‌ లేకుండా అర్చన చాలా బాగా నటించార''న్నారు దర్శకురాలు.

    "కథకు న్యాయం చేసే పాత్ర అర్చనది. సినిమాలో గ్రాఫిక్స్‌కు రెండో స్థానం ఉంటుంది. ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ''ఒక్క పాత్రతో సినిమాని తెరకెక్కించడమంటే చాలా కష్టం. గతంలో హిందీలో మాత్రమే ఓ సినిమా వచ్చింది. దీన్ని దర్శకురాలు చాలా నేర్పుతో చిత్రించారు''న్నారు ప్రముఖ దర్శకుడు సాగర్‌.

    English summary
    After the recent release of director Tanikella Bharani's Midhunam, which starred just two characters, SP Balasubramanyam and Lakshmi, director Sujatha will be setting an experimental tone for 2013.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X