»   » కన్నడ నటిపై యువకుల దాడి... ఈ రాత్రికి మాతో గడపమంటూ, నడీ రోడ్దుమీదే...

కన్నడ నటిపై యువకుల దాడి... ఈ రాత్రికి మాతో గడపమంటూ, నడీ రోడ్దుమీదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోజు రోజుకీ స్త్రీల మీద దాడులు పెరిగి పోతున్నాయి. అనామక యువతుల మీదే కాదు కాస్తో కూస్తో పేరున్న సెలబ్రిటీలు కూడా ఈ తరహా దాడులకు బలౌతున్నారు. మొన్నటికి మొన్న మళయాళ నటి భావన మీద జరిగిన కిడ్నాప్ గటన మర్చిపోక ముందే అదే తరహా సంఘటన మరోసారి జరిగింది. అయితే ఈ సారి బెంగుళూరు లో జరిగింది. నడీ రోడ్దుమీదే వర్థమాన నటి పై ఇద్దరు యువకులు దాడికి తెగబడటం. ఇప్పుడు శాండల్‌వుడ్ లో కలకలం రేపుతోంది.

పూర్తి సంఘటన వివరాలిలా ఉన్నాయి....

ఈ రాత్రికి మాతోనే గడుపుదువుగాని రా

ఈ రాత్రికి మాతోనే గడుపుదువుగాని రా

బెంగళూరు రాజగోపాలనగర ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమా షూటింగ్ లో పాల్గొని హెగ్గనహళ్లి వద్ద క్యాబ్‌ దిగి ఇంటికి వెళ్తున్న సినీనటిని సచిన్‌, ప్రవీణ్‌ అలియాస్‌ పుట్ట అడ్డగించారు. ఈ రాత్రికి మాతోనే గడుపుదువుగాని రా...అంటూ ఇద్దరూ చెరో చేతిని పట్టుకుని ఆమెను లాక్కు పోయే ప్రయత్నం చేశారు.

దాడి చేసి పరారయ్యారు

దాడి చేసి పరారయ్యారు

అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం, రోడ్డుమీద వెల్తున్న జనం కూడా ఆమెకి రక్షణగా రావటం తో వెనకడుగు వేసిన ఆ ఇద్దరు యువకులూ. ఆమెను దూషిస్తూ, దాడి చేసి పరారయ్యారు. పోలీస్ కంప్లైంట్ లో వారిద్దరితో తనకి మూడేళ్లుగా పరిచయం ఉందని, వారి వేధింపులతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.

ఆమె నగదు బాకీ ఉందని

ఆమె నగదు బాకీ ఉందని

అయితే ఇదే ఘటన మీద ఆ ఇద్దరు యువకుల కథనం వేరేగా ఉంది. ఆమె తమకు నగదు బాకీ ఉందని, తాము అడగడంతో తమపై ఆరోపణలు చేస్తోందని వారిద్దరూ చెబుతున్నారు. అయితే నగదు బాకీ ఉంటే చట్టబద్దంగా వసూలు చేయటం చేయాలిగానీ, ఆమె పై వ్యక్తిగత దాడికి దిగటం నేరమే కాబట్టి వారిని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు పోలీసులు. మొత్తానికి ప్రశాంతంగా ఉన్న కన్నడ సినీ పరిశ్రమ, బెంగుళూరు నగరం ఈ ఘటన తో కాస్త ఉలిక్కి పడినట్టయ్యింది.

మళయాలీ నటి పై జరిగిన దాడి దృష్ట్యా

మళయాలీ నటి పై జరిగిన దాడి దృష్ట్యా

గతం లోనూ దక్షిణాది సినిమాల్లో పాపులర్ హీరోయిన్, మళయాలీ నటి పై జరిగిన దాడి దృష్ట్యా ఇటువంటి సంఘటనల పై పోలీసులు కొంత సీరియస్ గానే ఉన్నారు. చెన్నయ్ లోనూ రద్దీ గా ఉన్న రోడ్దుమీదే భావనని కిడ్నాప్ చేయటం అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. మరి ఇప్పుడు ఈ కేసు విషయం లో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.

English summary
Kannada film industry shocked at attack on actress yesterday in bengaluru town
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu