»   » రివైండ్ : పవన్ కళ్యాణ్ అభిమానులను కంగారు పెట్టిన వేళ!

రివైండ్ : పవన్ కళ్యాణ్ అభిమానులను కంగారు పెట్టిన వేళ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ స్థాపించి నేటితో సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయింది. 2014 మార్చి 14వ తేదీన "పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం'' అంటూ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్న విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also Read: రాజకీయాల్లో....పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్!

పవన్ కళ్యాణ్ రాకతో చాలా మంది సంతోష పడ్డారు. అయితే ఆయన పార్టీని స్థాపించే విషయంలో చూపిన ఆసక్తి...దాన్ని ముందుకు నడిపించడంలో, పార్టీని అభివృద్ది చేయడంలో, పార్టీని విస్తరించడంలో చూపలేదనే చెప్పాలి. అప్పట్లో కేవలం ఎన్నికల ముందు హడావుడి చేసిన పవన్..... తర్వాత పార్టీ విషయాలను పక్కన పెట్టేసి సినిమాల్లో బిజీ అయిపోయారు.

Two Year For Pawan Kalyan's Revolution

అప్పట్లో అభిమానులను కంగారు పెట్టారు...
2014 మర్చిన 14వ తేదీని పార్టీ ఆవిర్భావం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు తనను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని, ప్రజలకు ఏదైనా చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నానని, సినిమాలపై ఇక ఆసక్తి లేదని, ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని, ఇక ప్రజా సేవకే అంకితం అవుతానని స్పష్టం చేసారు.

అప్పుడు పవన్ అలా కంగారు పెట్టినా..... తర్వాత తన సినిమా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆ ప్రకటన తర్వాత ఆయన 'గోపాల గోపాల ' చిత్రం చేస్తారు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రేణు దేశాయ్ నిర్మాతగా ఖుషి సీక్వెల్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు దిల్ రాజుతో కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు.

Also Read: పవన్ ఆస్తుల పై ఫేసు బుక్ లో రచ్చ

త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి...
పవన్ కళ్యాణ్ ఇటీవల అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను బట్టి 2018 వరకు సినిమాల్లో కొనసాగుతారని తెలుస్తోంది. ప్రస్తుతం తాను కమిటైన సినిమాలు పూర్తి చేసి 2019 ఎన్నికల సమయానికి సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగుతారని తెలుస్తోంది.

English summary
Janasena, Two year for Pawan Kalyan's Revolution for common man. With the motto of questioning the inequalities & injustice in the society, on this day, March 14th 2014, Pawan Kalyan started Janasena party to serve the nation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu