»   » తెలంగాణ ఉద్యమం గురించి చెప్పే మూవీ: ఆడియో రిలీజ్ చేసిన కెసీఆర్

తెలంగాణ ఉద్యమం గురించి చెప్పే మూవీ: ఆడియో రిలీజ్ చేసిన కెసీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో రూపోందించిన చిత్రం "త్యాగాల వీణ " . సుమన్ ,శివక్రిష్ణ , ప్రీతినిగమ్ , సుమశ్రీ , రాజీ , మధుబాల ,ఇంద్ర ,రాజీవ్ ,ప్రధానపాత్రధారులుగా ప్రేమ్ మూవీస్ బ్యానర్ పై కొత్తపల్లి సతీష్ బాబు నిర్మించగా మిర్యాల రవికుమార్ దర్శకత్వం వహించారు .రమేష్ ముక్కెర సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైద్రాబాద్ సి.యం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

Tyagala Veena

ముఖ్యమంత్రి కెసీఆర్ మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో త్యాగాల వీణ చిత్రం రూపోందించినందుకు చిత్ర దర్శకనిర్మాతలను అభినందించారు..ఈ చిత్రానికి రమేష్ ముక్కెర సంగీతం బాగుందని..భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.

Tyagala Veena

దర్శకుడు మిర్యాల రవికుమార్ మాట్లాడుతూ : త్యాగాల వీణ చిత్రం ఆడియో కెసిఆర్ చేతులు మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు..భవిష్యత్తులోను మంచి చిత్రాలు తీయడానికి క్రుషిచేస్తామన్నారు..రమేష్ ముక్కెర అందించిన పాటలు బాగున్నాయని కెసీఆర్ అభినందంచడం మా టీమ్ కు మంచి ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు..అంతేకాకుండా మా చిత్రానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన జానపద కళాకారుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొరియోగ్రాఫర్ చేయడం మా సినిమాకు ఎంతో హెల్ప్ అయిందన్నారు...

ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ , కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు : ఈద శంకర్ రెడ్డి , తెలంగాణ సాంస్క్రతి సారధి రసమయి బాలకిషన్ , అసిస్టెంట్ డైరెక్టర్ రాయల బిక్షం , పలువురు ఎమ్మేల్యేలు ,మంత్రులు పాల్గోన్నారు..

బ్యానర్ : ప్రేమ్ మూవీస్ , నటీనటులు : సుమన్ ,శివక్రిష్ణ , ప్రీతినిగమ్ , సుమశ్రీ , రాజీ , మధుబాల ,ఇంద్ర ,రాజీవ్ , సంగీతం : రమేష్‌ ముక్కెర, కెమెరా : డి. యాదగిరి, ఎడిటర్‌ : గడ్డం. సంతోష్‌, నిర్మాత : కొత్తపల్లి సతీష్‌ బాబు,సహా నిర్మాత :చింతా రెడ్డి వినోద్ రెడ్డి , స్క్రీన్‌ ప్లే-మాటలు-దర్శకత్వం : మిరియాల రవికుమార్‌.

English summary
Tyagala Veena Movie audio released by Telangana CM KCR.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu