Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకింగ్ ఫీట్లు, గర్వంగా ఉందంటూ కొరటాల శివ... (ఫోటోస్)
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' . ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో విడుదలవ్వబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని దర్శకుడు కొరటల శివ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ... 'మా చిత్రానికి U/A వచ్చింది. ఈ స్పెషల్ ప్రొడక్షును తీర్చిదిద్దడంలో భాగమైనందుకు సంతోషంతో పాటు గర్వంగా కూడా ఉంది. ఈ సినిమా కోసం నాకు సపోర్టు చేసిన వారందరికీ థాంక్స్. సినిమా థియేటర్లో కలుద్దాం' అంటూ పేర్కొన్నారు.
"జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మా నిర్మాతలు సిద్ధ పడుతున్నారు", అని శివ తెలిపారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ ల లో విడుదల కు సిద్ధం అవుతోంది. కాగా సినిమా రిలీజ్ అవుతున్న వేళ ఎన్టీఆర్ అభిమానులు ఒళ్లు గగుర్బొడిచే ఫీట్లు చేస్తున్నారు. చాతిపై, మొహంపై పచ్చబొట్లు వేయించుకుంటూ అభిమానం చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్..

జనతాగ్యారేజ్
" యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మించాం . భారీ తారాగణం తో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నిర్మాతలు
సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో ప్రపంచవ్యాప్తం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మా బ్యానర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలుస్తుంది అని అనుకుంటున్నాం" అని నిర్మాతలు తెలిపారు.

ముఖ్య పాత్రలు
సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పత్రాలను పోషిస్తున్నారు.

తెర వెనక
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. ఫైట్స్ - ఆణల్ అరసు. సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ . ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి . నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.) రచన - దర్శకత్వం - కొరటాల శివ.

అభిమానం
ఓ అభిమాని ఇలా ఎన్టీఆర్ రూపాన్ని తన చాతిపై పచ్చబొట్టు రూపంలోవేయించుకున్నారు.

మొహం
మొహంపై జనతాగ్యారేజ్ పచ్చబొట్టు వేయించుకున్న మరో అభిమాని.

కాజల్
జనతాగ్యారేజ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ ‘పక్కా లోకల్' అనే ఐటం సాంగులో అభిమానులను అలరించబోతోంది.

కర్నాటకలో కూడా..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సినిమా రిలీజవుతుందంటే భారీ బేనర్లో మామూలే. కానీ కర్నాటకలోని కూడా ఎన్టీఆర్ కు భారీ ఫాలోయింగ్ ఉందనడానికి బళ్లారిలోని ఓ థియేటర్ వద్ద ఈ ఏర్పాట్లే నిదర్శనం.

సమంత, ఎన్టీఆర్
సినిమాలో సమంత, ఎన్టీఆర్ మధ్య జరిగే లవ్ స్టోరీ సినిమాకు హైలెట్ కాబోతోంది.

తిరు
తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్