అన్నయ్యతో ఆ హీరోయిన్ సంబంధంపై తమ్ముడు ఇలా..!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, యష్ రాజ్ ఫిల్మ్ అధినేత ఆదిత్య చోప్రా-హీరోయిన్ రాణి ముఖర్జీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా బాలీవుడ్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఇపుడు కలిసే ఉంటున్నారని, ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా వీరి సంబంధంపై సంతృప్తిగానే ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయమై ఇటీవల ఆదిత్య చోప్రా సోదరుడు ఉదయ్ చోప్రాను....మీడియా వారు ప్రశ్నించారు. అయితే ఆయన ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించారు. 'ఈ విషయం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఏదో ఒకటి మాట్లాడి నేను అనసవరంగా సమస్యల్లో ఇరుక్కోదలుచుకోలేదు' అని వ్యాఖ్యానించారు. అయితే రాణితో తనకు చాలా కాలంగా మంచి పరిచయం ఉందని, ఆమె గ్రేట్ పర్సన్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఉదయ్ వెల్లడించారు.

ఉదయ్ చోప్రా వ్యాఖ్యలు బట్టి.....ఆదిత్య-రాణి మధ్య సంథింగ్ సంథింగ్ ఎపైర్ నడుస్తుందనే వార్తలకు మరింత బలం చేకూనట్లయింది. వారి సంబంధాన్ని ఖండించి ఉంటే విషయం వేరేలా ఉండేదేమో? కానీ మాట్లాడటానికి నిరాకరించారు. దీన్ని బట్టి ఆయన కావాలని వారి సంబంధాన్నిసీక్రెట్‌గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతోంది.
రాణి ముఖర్జీ యష్ రాజ్ ఫ్యామిలీ క్లోజ్ ఉంటూ వస్తోంది. వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా...ఏలాంటి సెలబ్రేషన్స్ జరిగినా రాణి తప్పకుండా హాజరవుతుంది. ఆ మధ్య ఆదిత్య చోప్రా తండ్రి యష్ చోప్రా ఆసుపత్రిలో చేరినప్పటి నుండే ఆమె తన ఈవెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకుని దగ్గరుండి చూసుకుందట. ఆయన మరణించిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన కుటుంబంతోనే గడిపింది.


Click it and Unblock the Notifications











