»   » ఉదయ్ కిరణ్ సంతాప సభ (ఫోటోలు)

ఉదయ్ కిరణ్ సంతాప సభ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు ఉదయ్ కిరణ్ సంతాప సభ హైదరాబాద్‌లోని ఏపీ ఫిల్మ్ చాంబర్‌లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నటి జీవిత, శివాజీ రాజా, పరుచూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

కాగా...ఉదయ్ కిరణ్ మృత దేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు అందించింది. ఉదయ్ కిరణ్ ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకోవడం ద్వారానే మరణించాడని గ్రూఫ్ ఆఫ్ డాక్టర్లు తేల్చారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

స్లైడ్ షోలో ఉదయ్ కిరణ్ సంతాప సభకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు...

కారణాలేంటి?

కారణాలేంటి?


ఇప్పటి వరకు తమకు తెలిసిన వివరాల ప్రకారం అవకాశాలు లేక పోవడం, గౌరవం లేక పోవడం, ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా అప్పటికప్పుడు అంత త్వరగా ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణమేంటనేది తెలుసుకునే ప్రయత్నేం చేస్తున్నామన్నారు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ


ఉదయ్ కిరణ్ కేసు విషయంలో రెండు టీంలు పని చేస్తున్నాయని తెలిపారు. భార్య విషిత, అత్తమామలను డీటేల్డ్‌గా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ వార్తలు అబద్దం

ఆ వార్తలు అబద్దం


మీడియాలో ప్రచారం జరిగినట్లుగా....ఉదయ్ కిరణ్ ఫోన్ నుంచి ‘ఐ లవ్ యూ' అనే మెసేజ్ ఏమీ వెళ్లలేదని, భూపాల్ అనే వ్యక్తితో కూడా మాట్లాడలేదని డీసీపీ తెలిపారు.

ఉదయ్ కిరణ్ కాల్ డేటా

ఉదయ్ కిరణ్ కాల్ డేటా


ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఉదయ్ కిరణ్ ఫోన్ నుండి మొత్తం 4 కాల్స్ వెళ్లాయని...అందులో రెండు కాల్స్ భార్య విషితకు, రెండు కాల్స్ శరత్ అనే కుర్రాడికి వెళ్లినట్లు తెలిపారు. శరత్ అనే వ్యక్తి విషితకు క్లాస్ మేట్ అని, ఫ్రెండ్ అని తమకు తెలిసిందని తెలిపారు.

గతంలో ఆత్మహత్య ప్రయత్నం

గతంలో ఆత్మహత్య ప్రయత్నం


ఉదయ్ కిరణ్ చేతిపై గతంలో బ్లేడుతో కోసుకున్నట్లుగా గుర్తులు ఉన్నాయి. దీన్ని గతంలో ఆయన రెండు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో విషత ఎక్కడ?

ఆ సమయంలో విషత ఎక్కడ?


ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న రోజు విషిత అర్ధరాత్రి వరకు ఫ్రెండ్ రోహిత్ ఫంక్షన్‌కి వెళ్లిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు వచ్చే లోపే...

పోలీసులు వచ్చే లోపే...


ఆత్మహత్య జరిగిన 15 నిమిషాల్లోగా భార్య విషిత, అత్తమామలు సంఘటన స్థలానికి చేరుకున్నారని, ఉరి వేసుకున్న ఉదయ్ కిరణ్ బాడీని దించేసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారని......ఈ కారణంగా సంఘటన స్థలంలో ప్రాథమిక ఆధారాల సేకరించే అవకాశం పోలీసులకు లేకుండా పోయిందని తెలిపారు.

సూసైడ్ నోట్ రాయలేదా?

సూసైడ్ నోట్ రాయలేదా?


ఎలాంటి సూసైడ్ నోట్ తమకు లభించలేదని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఏ విషయమనేది తేలుస్తామని డీసీపీ స్పష్టం చేసారు.

మరో యాంగిల్

మరో యాంగిల్


తాజాగా మరో యాంగిల్ బయిటకు వచ్చింది. గతంలో ఉదయ్ కిరణ్ తో సినిమా చేసే నిమిత్తం ఓ హీరోయిన్ 15 లక్షలు పెట్టుబడి పెట్టిందట. ఆమె వచ్చి రీసెంట్ గా అతనిపై ఆ డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డిసిపీ మీడియాకు తెలియచేసారు.

డామిట్ కథ అడ్డం తిరిగింది

డామిట్ కథ అడ్డం తిరిగింది


డీసీపీ మాట్లాడుతూ....గతంలో ఉదయ్ కిరణ్ వద్ద మేనేజర్ గా పనిచేసిన మున్నా నిర్మాతగా మారి డామిట్ కథ అడ్డం తిరిగింది సినిమా చెయ్యాలని మొదలెట్టారు. ఇందులో ఓ హీరోయిన్ కూడా 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవటంతో సదరు హీరోయిన్ వచ్చి ఉదయ్ కిరణ్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం మున్నాని విచారిస్తాం అన్నారు.

English summary
Telugu Film Actor Uday Kiran Condolence Meet held on Jan 7th at Film Chamber, Hyderabad, Tollywood Celebrities like Paruchuri Gopala krishna, Shivaji Raja, Jeevitha Rajasekhar and others are presented.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu