ఉదయ్ కిరణ్ చివరి సినిమాపై షాకింగ్ అప్డేట్.. ఓటీటీ డీల్ కోసం చర్చలు.. రిలీజ్ ఎప్పుడంటే?
ఒకప్పుడు లవర్ బాయ్ క్రేజ్ అందుకున్న నెంబర్ వన్ హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. అలాంటి మంచి హీరో జీవితం ప్రశ్నార్థకంగా అనుకోకుండా ముగిసిపోవడం అప్పట్లో అందరిని షాక్ కు గురి చేసింది. ఇక ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ కాకుండానే మరుగున పడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాను ఎలాగైనా ఓటీటీలో విడుదల చేయాలని అభిమానుల నుంచి డిమాండ్ గట్టిగానే వస్తోంది. ఇక ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు కూడా నిర్మాతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.

ఎప్పుడైనా సరే.. అదే చిరునవ్వు
ఉదయ్ కిరణ్ చూడగానే మనసుకు హత్తుకునేలా చిరునవ్వుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవాడు. వెండితెరపై అలాగే నిజజీవితంలో ఎదురుగా కనిపించినా సరే ఎంతో హ్యాండ్సమ్ గా ఉండేవాడు. అతను తప్పకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతాడాని అందరూ అనుకున్నారు. కానీ అతని సక్సెస్ రేటు ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఆ సినిమాలు హిట్టవ్వడంతో
ప్రేమ కథలను చేసుకుంటూ వెళ్లడం వలన కూడా ఉదయ్ కిరణ్ క్రేజ్ అంతవరకే ఆగిపోయింది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అప్పట్లో ఆ సినిమాలు పెట్టిన బడ్జెట్ కు పదింతల లాభాలను అంధించాయి. దీంతో వెంటవెంటనే బడా నిర్మతల నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి.

వరుస అపజయాలు రావడంతో
అయితే మరికొన్నాళ్ల అనంతరం ఉదయ్ కిరణ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తే బెటర్ అని మధ్యలో శ్రీరామ్ అనే మాస్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఉదయ్ కిరణ్ కు అనుకున్నంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది. వరుస అపజయాలు రావడంతో ఉదయ్ కిరణ్ 2015లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఓటీటీలో ఆఖరి సినిమా
ఇక ఉదయ్ కిరణ్ నుంచి చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జై శ్రీరామ్. ఆ సినిమా తరువాత ఆఖరి సారిగా నటించిన సినిమా 'చిత్రం చెప్పిన కథ'. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కొన్ని ఆర్థిక కారణాల వల్ల విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం ఓటీటీ కంపెనీలు అటకెక్కిన పాత సినిమా హక్కులను కొనుక్కొని కొత్తగా రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్ కూడా చిత్రం చెప్పిన కథ కోసం చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ కావచ్చని తెలుస్తోంది. నిర్మాతలు డీల్ కు ఒప్పుకుంటే వెంటనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు.


Click it and Unblock the Notifications











