»   » ఉదయ్ కిరణ్ భార్యతో పబ్లిక్‌లోకి తొలిసారిగా...(ఫోటోలు)

ఉదయ్ కిరణ్ భార్యతో పబ్లిక్‌లోకి తొలిసారిగా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు యాక్టర్ ఉదయ్ కిరణ్ గత సంవత్సరం అక్టోబర్ 24న తన గర్ల్ ఫ్రెండ్ విశితానును పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భార్యతను తీసుకుని ఎన్నడూ పబ్లిక్ లోకి రాని ఉదయ్ కిరణ్ దాదాపు నాలుగు నెలల తర్వాత వైఫ్ తో కలిసి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఉదయ్ కిరణ్ తను నటిస్తున్న జైశ్రీరామ్ ఆడియో వేడుకకు భార్యతో కలిసి హాజరయ్యాడు. ఇటీవలే ఈ వేడుక హైదరాబాద్ లోని రాక్ గార్డెన్స్ లో జరిగింది.

'చిత్రం' సినిమాతో హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరణ్ ఆ సినిమా హిట్ కావడంతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ వెంటనే నువ్వునేను, మనసంతా నువ్వే చిత్రాలు లాంటి హిట్ చిత్రాలు అతనికి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి. అయితే ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాలేవీ బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోలేదు. దీంతో ఉదయ్ కిరణ్ ప్లాపు హీరోల లిస్టులో చేరిపోయాడు. కొంత కాలం సినిమాలకు దూరమైన ఉదయ్ తాజాగా 'జై శ్రీరామ్' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

లవర్ బాయ్ ఇమేజ్ తో ఒకప్పుడు టాలీవుడ్ స్క్రీన్ కు క్రేజీ హీరోగా పేరుతెచ్చుకున్న ఈ హీరో ఈ సినిమాలో రఫ్ గా కనిపించడానికి చాలా హోమ్ వర్క్ చేసినట్టే కనపడుతోంది. సాఫ్ట్ వాయస్ తో ఉండే ఉదయ్ తన వాయస్ మాడ్యులేషన్ కూడా కొంచం రఫ్ గానే మార్చుకున్నాడు, ఇంత కష్టపడుతున్న ఉదయ్ కి ఈసారైనా హిట్ రావాలని ఆశిద్దాం.

గతంలో ఉదయ్ కిరణ్ కి చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ అనుకోని కారణాలతో ఇది పెళ్లి వరకు వెళ్లలేదు.

సుస్మితతో ఎంగేజ్ మెంట్ బ్రేకప్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్ కొంతకాలం సినిమాలకు దూరం అయ్యాడు.

కొన్ని సంవత్సరాలుగా ఉదయ్ కిరణ్ తన గర్ల్ ఫ్రెండ్ విశితతో డేటింగ్ చేస్తున్నాడు. ఎంగేజ్ మెంట్ వరకు వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఎవరికీ తెలియలేదు.

ఉదయ్ కిరణ్-విశిత వివాహం అక్టోబర్ 24, 2012న అన్నవరం దేవాలయంలో జరిగింది.

వీరి వివాహ వేడుకకు వారి బంధువులు, ఉదయ్ కిరణ్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.

అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ స్టార్స్ హాజరయ్యారు.

పెళ్లి తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా విడుదలవుతున్న సినిమా కావడంతో.... ఈ సారైనా అతనికి అదృష్ఠం కలిసి రావాలని అంతా కోరుకుంటున్నారు.

English summary
Telugu actor Uday Kiran, who tied the knot with his girlfriend Visitha on October 24, made his first public appearance with his wife exactly four months after his marriage. His wife attended the audio release function of his much-hyped comeback movie Jai Sriram, which was held at Rock Garden in Hyderabad on February 24. The couple were seen all excited as they posed for the photographers at the event.
Please Wait while comments are loading...