For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డౌట్స్ ఉన్నాయి: చిరు కూతురుతో పెళ్లి రద్దు, ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై... సోదరి శ్రీదేవి

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. ఆయన మరణించి దాదాపు మూడేళ్లపైనే అయినా ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదె అంటే తెలుగు ప్రేక్షకుల మదిలో ఉదయ్ కిరణ్ స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

  ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, సినిమా అవకాశాలు లేవని ఇలా చాలా వార్తలు వినిపించాయి. అప్పట్లో చిరంజీవి పేరు కూడా ఈ విషయంలో బయటకు రావడం అందరినీ షాక్ గురి చేసింది.

  దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి.... ఉదయ్ కిరణ్ జీవితానికి సంబంధించిన పలు విషయాలు ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. చిరంజీవి ఇష్యూ గురించి కూడా మాట్లాడారు.

  ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు

  ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు

  ఉదయ్ కిరణ్ మరణించే సమయంలో ఫైనాన్షియల్ సమస్యలున్నట్లు, పాల ప్యాకెట్లకు కూడా డబ్బు లేవు అనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం. మియా పూర్, శంషాబాద్ మూడు ల్యాండ్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ ఉంది. మనీ లేక పోవడ కారణం కాదు, సినిమాల్లేక పోయినా జీవించే స్తోమత ఉంది అని తమ్ముడి గురించి శ్రీదేవి చెప్పుకొచ్చారు.

  చివరిసారి కలిసింది అప్పుడే

  చివరిసారి కలిసింది అప్పుడే

  ఉదయ్ మరణం మీద మీకెలా డౌట్ ఉందో నాకూ అలాగే ఇంకా కొన్ని డౌట్ ఉన్నాయి. మరణించిన రోజు ఉదయమే మాట్లాడాను. ఎప్పుడూ ఏ కష్టం ఉన్నట్లు చెప్పలేదు. సినిమాల్లేక, డబ్బుల్లేక కాదు. పెళ్లి కూడా ఇష్ట ప్రకారమే చేసుకున్నాడని శ్రీదేవి తెలిపారు.

  నాన్న వేరే అమ్మాయితో ఉంటున్నాడు, ఉదయ్‌కి నచ్చలేదు

  నాన్న వేరే అమ్మాయితో ఉంటున్నాడు, ఉదయ్‌కి నచ్చలేదు

  అమ్మ చనిపోయాక నాన్నకు, తమకు మధ్య దూరం పెరిగిపోయింది. నాన్న వేరేగా ఉంటున్నారు. ఆయన ఇంట్రెస్ట్ ఆయనది, మాతో మాట్లాడాలనుకోలేదు. మానాన్న గారు ఇంకో అమ్మాయితో ఉంటున్నారు. తమ్ముడికి నచ్చలేదు. ఎవరైనా అమ్మ ప్లేసులో ఇంకొకరిని ఊహించుకోలేరు. నేను కూడా తమ్ముడి సైడే ఉండిపోయాను అని శ్రీదేవి తెలిపారు.

  ఎప్పుడూ డౌట్ రాలేదు

  ఎప్పుడూ డౌట్ రాలేదు

  అన్నవరంలో మేమే పెళ్లి పెద్దలుగా ఉదయ్-విషిత పెళ్లి జరిపించాము. పెళ్లి తర్వాత ఒక్కసారే 2013 జూన్ లో బంధువుల పెళ్లిలో ఆఖరుగా చూశాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. విషిత ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆమె గురించి అడిగితే బయటకు వెళ్లిందని చెప్పేవాడు. చాలా సంతోషంగా ఉన్నాననే చెప్పేవాడు. విషితను చాలా ప్రేమించాడు. హెవెన్ లో ఉన్నాననే చెప్పేవాడు. వారు సంతోషంగా లేరని ఆ సమయంలో ఎప్పుడూ డౌట్ కూడా రాలేదు అని శ్రీదేవి తెలిపారు.

  విషిత కాంటాక్టులో లేదు, అందుకే కొంచెం డౌట్

  విషిత కాంటాక్టులో లేదు, అందుకే కొంచెం డౌట్

  ఉదయ్ పోయిన తర్వాత విషిత మాతో మాట్లాడలేదు. ఇపుడు టచ్ లేదు, కాంటాక్టులో లేదు. ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఉదయ్ ప్రాపర్టీ అంతా తన చేతిలోనే ఉంది. ఇపుడు పరిస్థితి చూస్తుంటే అప్పుడప్పుడూ డౌట్ అనిపిస్తుంది. అంతా బావుండి ఉంటే విషిత తరుపు వారు మాతో కాంటాక్టులో ఉండి ఉండాలి అని శ్రీదేవి అన్నారు.

  చిన్న డౌట్ ఉన్నా వదిలేదాన్ని కాదు

  చిన్న డౌట్ ఉన్నా వదిలేదాన్ని కాదు

  ఆ సమయంలో నాకు చిన్న డౌట్ ఉన్నా వదిలేదాన్ని కాదు. ఉదయ్ ఎప్పుడూ చెప్పలేదు. బయట కూడా వారు హ్యాపీగా ఉన్నట్లే ఉంది. జాన్ 5 ఆ న్యూస్ రావడం షాక్. తర్వాత జరిగే సంఘటనలు డౌట్ గానే ఉంది. నేను మస్కట్ లో ఉంటాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసేది కాదు అని శ్రీదేవి తెలిపారు.

  మా అన్నయ్య సూసైడ్

  మా అన్నయ్య సూసైడ్

  మా ఫ్యామిలీలో మా అన్నయ్య కూడా ఉదయ్ లాగే సూసైడ్ చేసుకున్నాడు. ఆయన డిఫరెంట్ పర్సన్. హైలీ ఇంటలెక్చువల్ పర్సన్. ఈ సమాజంలో జరిగే అన్యాయాలు ఆయనకు నచ్చేవి కాదు. తాను హిమాలయాస్ వెలుతానని చెప్పేవాడు అని శ్రీదేవి తెలిపారు.

  అమ్మ వద్ద గోల్డ్, సిల్వర్

  అమ్మ వద్ద గోల్డ్, సిల్వర్

  అమ్మ వద్ద నాలుగు కిలోల గోల్డ్, 80 నుండి 100 కిలోల సిల్వర్ ఉండేది. అదంతా ఉదయ్ దగ్గరే ఉండేది. ఉదయ్ ఉన్నపుడు నీ షేర్ తీసుకునే అంటే నేను మస్కట్లో ఉంటాను కాబట్టి నీ వద్దే ఉండనివ్వు అని చెప్పేదాన్ని, ఇపుడు అదంతా విషిత వద్దే ఉన్నాయి అని శ్రీదేవి తెలిపారు.

  8 సంవత్సరాల వయసులోనే

  8 సంవత్సరాల వయసులోనే

  8 ఏళ్ల వయసులోనే నేను చిరంజీవి లాగా పెద్ద హీరో అవుతానని చెప్పాడు. ఎన్నో కలలతో సినిమా రంగంలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. తనకంటూ ఓ బాట వేసుకున్నాడు అని తమ్ముడి గురించి శ్రీదేవి చెప్పుకొచ్చారు.

  చిరంజీవికి సంబంధం లేదు

  చిరంజీవికి సంబంధం లేదు

  ఉద‌య్ మ‌ర‌ణం వెనుక ముఖ్య కార‌ణం చిరంజీవి ఉన్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను శ్రీదేవి కొట్టి పారేశారు. సుస్మితతో పెళ్లి రద్దు నిర్ణయం ఉదయ్ కిరణ్ దేనని.. చిరంజీవిది కానేకాదని ఆమె తెలిపారు.

  చిరంజీవి సపోర్ట్ ఇచ్చచారు.

  చిరంజీవి సపోర్ట్ ఇచ్చచారు.

  సుస్మితతో ఎంగేజ్ మెంట్ జరగక ముందు నుంచే ఉదయ్ కిరణ్ కు చిరంజీవి ఎంతో సపోర్ట్ నిచ్చారు . అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు (లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన సమయంలో) చిరంజీవిగారు ఎంతో అండగా నిలిచారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికీ సిద్ధపడ్డారు అని శ్రీదేవి తెలిపారు.

  వారి ఆతిథ్యం అద్భుతం

  వారి ఆతిథ్యం అద్భుతం

  మేము ఒకసారి చిరంజీవి ఇంటికి వెళ్లాం. వారి ఆతిథ్యం అద్భుతమనే చెప్పాలి. కానీ ఎందుకో సుస్మితతో తనకు సరిపడదని ఉదయ్ భావించాడు. తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా అతడి నిర్ణయమే. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో టచ్ లోనే లేడని శ్రీదేవి చెప్పారు.

  విషితతో సంతోషంగా ఉండలేదేమో అని ఇపుడు డౌట్

  విషితతో సంతోషంగా ఉండలేదేమో అని ఇపుడు డౌట్

  తర్వాత కాలంలో విషితతో ఉదయ్ వివాహం జరిగింది. ఎందుకో వాళ్లిద్దరూ సంతోషంగా ఉండలేకపోయారని ఇపుడు డౌట్ వస్తోంది. ఉదయ్ కిరణ్ జ్జాపకాలు కొన్ని అడిగితే తర్వాత కొరియర్ లో పంపిస్తానని చెప్పింది. కానీ ఇపుడు విషిత తమకు టచ్ లేకుండా పోయింది. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అని శ్రీదేవి అన్నారు.

  English summary
  In an interview to a Telugu channel, Uday Kiran sister Sridevi said, "Uday had a hit a rough patch in his personal life after the breakup with a girl he loved. He was sobbing a lot. Chiranjeevi was very supportive during his down time. He was like Uday's Godfather. And even Uday had a lot of respect for him. Chiranjeevi advised him a lot to move on and after some time he came up with the marriage proposal saying Sushmitha liked Uday. He is a wonderful person." She also said that Uday was suffering from depression after his break-up.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X