ఉదయ్ కిరణ్ దానికయినా పనికొస్తాడా?

ఎందుకంటే గెస్ట్ రోల్స్ వేయాలంటే కాస్త పేరున్న హీరోలను,డిమాండ్ ఉన్న హీరోలను అడుగుతారు. తమ సినిమాకు ఏమన్నా ఫ్లస్ అవుతుందన్న భ్రమ ఉంటేనే అటువంటి ప్రయత్నాలు దర్శక,నిర్మాతలు చేస్తారు. కొద్ది కాలంగా జగపతిబాబు ఇలా గెస్ట్ రోల్స్ వేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇఫ్పుడు ఎన్టీఆర్ రెండువ తేదీన రిలీజ్ కాబోతున్న చింతకాయల రవి చిత్రంలోనూ,పూరీ నేనింతే లోనూ గెస్ట్ రోల్స్ కి రెడీ అవుతున్నాడు. అలాగే వెంకటేష్ మర్మయోగి చిత్రంలో గెస్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉదయ్ ఆ మాట అన్నా ఎవరు తమ సినిమాల్లో గెస్ట్ గా పిలుస్తారనేది ఆలోచించాల్సిన విషయమే. ఇక అతను ఇద్దరు హీరోల సినిమాల్లో ప్రయత్నాలు చేస్తే ఏమన్నా ఫలితం ఉండవచ్చు.అలాగే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ప్రయత్నించినా మళ్ళీ ఎప్పటికైనా లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications











