ఉదయ్ కిరణ్ వివాహ విశేషాలు
వివాహ వేడుకను నిరాడంబరంగా కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకూ స్నాతకం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి పది గంటల నుంచి పెళ్లివేడుక ప్రారంభమైంది. ఉదయ్‌కిరణ్, విషితలను వధూవరులను చేసి వారిచే వరపూజ చేసే కార్యక్రమాన్ని పండితులు నిర్వహించారు. ముఖ్యులు అనకున్న అతి కొద్ది మంది వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఇక ఉదయ్ కిరణ్, ఆమె రెండేళ్లక్రితం కాకతాళీయంగా ఒక చిన్న కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆమె తమిళయన్. వారి మధ్య పరిచయం ..స్నేహంగా.. ప్రేమగా.. దాపరికం లేని అనుబంధంగా మారింది. దానికి పెద్దలు అంగీకరించారు. దీంతో విజయదశమి వేళ.. వారి పెళ్లి సందడికి అన్నవరం సత్యదేవుని సన్నిధి వేదికగా మారింది. ఆ యువకుడు ప్రముఖ సినీ హీరో ఉదయకిరణ్ కాగా.. అతడిని వరించిన యువతి విషిత.
ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.... 'ఒక చిన్న ఫంక్షన్‌లో కలిసిన మేము స్నేహితులయ్యాం.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నాం' అంటూ తన మనసులో మాటలను ఈ సందర్భంగా బయటపెట్టారు. మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు చేరుతుందని ఏనాడు అనుకోలేదు. నా మనస్తత్వాన్ని అర్థం చేసుకునేవారినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అలాంటి లక్షణాలే విశితలో ఉన్నాయి. అందుకే మేం వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. వివాహ బంధం మా కొత్త జీవితాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తుందని అనుకుంటున్నానన్నారు. ధట్స్ తెలుగు ఈ నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications












