»   » అశ్లీలంగా చిత్రీకరించారు: పోలీసులకు ఉదయభాను కంప్లైంట్

అశ్లీలంగా చిత్రీకరించారు: పోలీసులకు ఉదయభాను కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాపులర్ యాంకర్ ఉదయభాను తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'మధుమతి'. గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ నిర్మించారు. ఉదయభాను ఇందులో వేశ్య పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'మధుమతి' చిత్ర దర్శక నిర్మాతలపై ఉదయభాను ఫిర్యాదు చేసారు. తన పాత్రను అశ్లీలంగా చిత్రీకరించినట్లు ఉదయభాను సీసీఎల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

కాగా....అగ్రిమెంటు ప్రకారం తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా చెల్లించక పోవడం కూడా మరో కారణమని తెలుస్తోంది. తాను షూటింగుకు సరిగా హాజరు కాలేదని దర్శక నిర్మాతలు ప్రచారం చేస్తుండటంపై కూడా ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్.

సినిమాలో ఓ స్పెషల్ సాంగు విషయంలో ఉదయభాను హాజరు రాక పోవడం వల్లే వేరే వారితో చిత్రీకరించినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్లో కీలకమైన ఆడియో ఫంక్షన్‌కు కూడా ఉదయభాను డుమ్మా కొట్టిందని గుర్రుగా ఉన్నారు నిర్మాతలు. అయితే తాను హాజరైనప్పటికీ వేరే నటితో చిత్రీకరించారని ఉదయభాను వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి 'మధుమతి' సినిమా విడుదలకు ముందు నుంచే వివాదాల్లో ఇరుక్కుంది. ఇటు ఉదయభాను, అటు దర్శకనిర్మాతల మా మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చూడాలి.

English summary
Udaya Bhanu files complaint against 'Madhumati' Director and Producer. It is heard that, Udaya Bhanu is displeased with deprived treatment meted out to her by makers during the film’s shoot and also remuneration payment issues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu