»   » ఉదయభాను న్యూ హాట్ లుక్ (ఫోటోలు)

ఉదయభాను న్యూ హాట్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాపులర్ యాంకర్ ఉదయభాను తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'మధుమతి'. ఉదయభాను ప్రధాన పాత్రలో గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ 'మధుమతి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో ఉదయభాను సెక్స్ వర్కర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కూడా విడుదల చేసారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదలకు సిద్ధం కాబోతోంది. అయితే ఇటీవల జరిగిన ఆడియో వేడుకకు ఉదయభాను గైర్హాజరవ్వడంతో అంతా షాకయ్యారు. ఉదయభాను తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

మధుమతి చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న ఉదయభాను ఈ చిత్రంలో సెక్స్ వర్కర్‌గా కనిపించబోతోంది. ఈ చిత్రంలో దీక్షాపంథ్, విష్ణు ప్రియన్, సీతా, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కడియం రమేష్, కె. రాణి శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

రాజ్ శ్రీధర్ దర్శకత్వం

రాజ్ శ్రీధర్ దర్శకత్వం


మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...‘నేను ఉదయభాను‌కు సరిపోమే కథని 8 సంవత్సరాల క్రితమే తయారు చేసుకోవడం జరిగింది. విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలు‌ను తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా సినిమా ఉంటుంది' అన్నారు.

మధుమతి

మధుమతి


సమర్పకులు కడియ రమేష్ మాట్లాడుతూ...అండర్ వాటర్లో తీసిన సీన్లు చాలా బాగా వచ్చాయి. ఉదయభాను ఎంతో ధైర్యంగా ఈ సీన్లు చేసింది. కెమెరామెన్ వి.ప్రభాకర్ ఎంతో అద్భుతమైన పనితనం కనబర్చారు. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

నిర్మాతలు సీరియస్

నిర్మాతలు సీరియస్


ఆడియో వేడుకకు ఉదయభాను గౌర్హాజరవ్వడంపై ఆ చిత్ర దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...‘మధుమతి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ఉదయభాను హాజరు కాకపోవడంపై నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారు. సినిమా ప్రమోషన్లో ఆడియో వేడుక ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఎలాంటి కారణం చెప్పకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆమె గైర్హాజరయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

వివాదం

వివాదం


షూటింగు సమయంలో కూడా ఉదయభాను అనేక ఇబ్బందులకు గురి చేసిందని దర్శకుడు వెల్లడించారు. తొలుత స్పెషల్ సాంగులో చేస్తానని అంగీకరించి...తీరా షూటింగుకు అంతా సిద్ధమైన తర్వాత నిరాకరించిందని, దాంతో వేరే వారితో ఆ సాంగును పూర్తి చేసామని దర్శకుడు తెలిపారు. అయితే ఈ సంఘటనపై స్పందించడానికి ఉదయభాను అందుబాటులో రాలేదు.

తారాగణం

తారాగణం


ఉదయభాను, దీక్ష్, శివకుమార్, గౌతమ్, సీత, తెలంగాణ శకుంతల, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు, సతీష్, బస్టాప్ కోటేశ్వరరావు, నాగభైరవ అరుణ్ కుమార్ తదితరులు నటించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈచిత్రానికి ఫోటోగ్రఫీ : సత్య వి.ప్రభాకర్, సంగీతం : రాజ్ కిరణ్, నిర్మాత: రాణి శ్రీధర్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : రాజ్ శ్రీధర్.

మధుమతిలో మసాలా ఎలిమెంట్స్

మధుమతిలో మసాలా ఎలిమెంట్స్


ఈ చిత్రానికి రాజ్ శ్రీధర్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కామెడీ, యాక్షన్, డ్రామా, టెంపో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట. విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలు‌ను తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా చిత్రీకరిస్తున్నాం అని అంటున్నారు దర్శకుడు.

English summary
Udaya Bhanu's upcoming film Madhumati movie new pics released. She essays the role of a sex worker in the film, which also features Diksha, Vishnu Priyan, Seeta and Prabhas Srinu in important roles. The film is jointly produced by Kadiyam Ramesh and K. Ranishreedhar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu