»   » ఇరగేసి, తిరగేసి ఐటెం భామలకు దడపుట్టిస్తోన్న టీవీ యాంకర్..!!

ఇరగేసి, తిరగేసి ఐటెం భామలకు దడపుట్టిస్తోన్న టీవీ యాంకర్..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టీవీ తెరపై గత దశాబ్దం నుండీ కనిపిస్తున్నా చెక్కుచెదరని అందం, ఫిట్ నెస్ తో, రెట్టించిన ఉత్సాహంతో యాంకరింగ్ చేస్తున్న భామ ఉదయభాను. తొలుత ఈ భామ వెండి తెరపై ఆర్ నారాయణమూర్తి సినిమాలో ఆయన కూతురిగా ముఖ్య పాత్రలో నటించి, ఆ తర్వాత ఓ ఐటెం సాంగ్ చేసినా అదృష్టం కలసిరాకపోవడంతో ఇహ లాభం లేదనుకొని బుల్లితెరకే పరిమితం అయింది. అయినా ఆమె వెండి తెర కల మాత్రం ఇంకా పూర్తికాలేదు. హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా అదృష్టం కలసిరాలేదు మరి.

ఆ మధ్య రామ్ లక్ష్మణ్ ల సినిమాలో నటించినా, ఆపదమొక్కుల వాడ సినిమాలో హాట్ హాట్ గా ఐటెం సాంగ్ చేసినా అనుకున్నంత గుర్తింపురాలేదు. కానీ శేఖర్ కమ్ముల దృష్టిలో పడేలా చేసాయి. దీంతో ఆమె లీడర్ సినిమాలో "రాజశేఖర నీపై మోజు తారలేదులా" అంటూ రెచ్చిపోయి తన సత్తాను చాటుకుంది. ఈ పాటలో ఆమె అద్భుతం అనే రేంజిలో నాట్యం చెయ్యకపోయినా, ఉదయభాను అద్భుతంగా చేసింది, ఇరగదీసింది అంటూ టివీ ఛానెల్ల వారు ఊదరగొడుతున్నారు. ఆమె ధాటితో మిగిలిన ఐటెం భామలు హడలెత్తిపోతున్నారని, ఆమె ఖచ్చితంగా మిగిలిన వారందరికీ చెక్ పెడుతుందని అంచనాలు వేస్తున్నారు. మరి నిజంగా భానుకు అంత సీన్ వుందా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న... మీరేమంటారు...!?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu