»   » "సెన్సార్ దిద్దిన సినిమా " అంటే ఇదే మరి: ఉడ్తా పంజాబ్ టీం పిచ్చ హ్యాపీ అట

"సెన్సార్ దిద్దిన సినిమా " అంటే ఇదే మరి: ఉడ్తా పంజాబ్ టీం పిచ్చ హ్యాపీ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ బోల్తాకొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..." తెలుగు రాదు గానీ వచ్చుంటే అనురాగ్ కాశ్యప్ ఇప్పుడు ఇదే పాట పాడుతూ వీర డాన్స్ చేసేవాడు. అసలు ఉడ్తా పంజాబ్ అనే ఒక సినిమా వస్తోందని రెగ్యులర్ గా సినిమా మీద దృష్టి ఉండే బాలీవుడ్ అభిమానులకు తప్ప ఇంకా ఎవరికీ పెద్దగా తెలియదు.

షాహిద్ కపూర్ పెద్ద స్టారేమీ కాదు.. ఇక ఆలియా విశయానికి వస్తే మంచి యాక్టరే అయినా మరీ జనాన్ని థియేటర్ కి లాక్కోంచేంత తురుపుముక్క ఏం కాదు. ఇక కరీనా కి ఇప్పుడున్న క్రేజ్ ఏమిటో మనకి తెల్సిందే.. మామూలుగా అయితే ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చేవి. ఇంకో నాలుగు రోజులు సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు అయిపోయేది.

Udta Punjab got Free publicity with Censor Controversy

కానీ సెన్సార్ వివాదం తో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పల్లెలో ఉన్న కుర్రాళ్ళు కూడా "ఉడ్తా పంజాబ్" గురించి మాట్లాడుకునే దాకా వచ్చింది. సెన్సార్ వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి విపరీతమైన చర్చ జరిగింది. నేషనల్ మీడియా దగ్గర్నుంచి.. లోకల్ మీడియా వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున వార్తలిచ్చారు., డిబేట్లు నడిపారు.

సోషల్ మీడియాలో కూడా దీని గురించి హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. సెన్సార్ బోర్డు 40 కట్స్.. రివైజ్డ్ కమిటీ ఏకంగా 89 కట్స్ చెప్పిందంటే సినిమాలో అంత వివాదాస్పద అంశాలు ఏమున్నాయో చూద్దామని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Udta Punjab got Free publicity with Censor Controversy

ఈ కాంట్రవర్శీ పుణ్యమా అని ఉడ్తా పంజాబ్ కి అనూహ్యంగా ఓపెనింగ్స్ వస్తాయని ఆశస్తున్నారు. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా సెన్సేషనల్ హిట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి "ఉడ్తా పంజాబ్" దర్శక నిర్మాతలు సెన్సార్ బోర్డుకు దండేసి దణ్ణవెట్టుకున్నా తప్పులేదు....

ఇంతా చేస్తే సెన్సార్ బోర్డు సాధించిందేమిటయ్యా అంటే... జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవటమే కాకుండా. కత్తెర వేసే అధికారం తనకు లేదన్న విశయం సాక్షాత్తూ కోర్టు చేతే చెప్పించుకొని మొట్టికాయలు వేయించుకోవటం. . మరీ దేశ రాజకీయాలని, శాంతి భద్రతలనీ రెచ్చగొట్టే విశయం అయితే తప్ప... స్వయంగా సీన్లకు కత్తెర వేసి "ఎడిట్" చేసే అధికారం సెన్సార్ బోర్డుకి లేదన్న విషయం సగం మంది సినిమా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు "ఉడ్తా పంజాబ్" పుణ్యమా అని అందరికీ తెలిసి పోయింది.

English summary
Finally Udta Punjab has been released from the Censor Board with an ‘A’ certificate and a single cut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu