»   » ఉలవచారు బిర్యానీ ఆడియో వేడుక, ఇళయరాజాకు ఘనంగా సన్మానం

ఉలవచారు బిర్యానీ ఆడియో వేడుక, ఇళయరాజాకు ఘనంగా సన్మానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'ఉలవచారు బిర్యానీ'. ప్రకాష్ రాజ్, స్నేహ, ఊర్వశి, బ్రహ్మాజీ, తేజస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు క్రియేటివ్ కమర్షియల్ బేనర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఆడియో సీడీలను ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు విడుదల చేసారు. అనంతరం సినీ ప్రముఖుల సమక్షంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కె.ఎల్.నారాయణ, ఏడిద నాగేశ్వరరావు, అశ్వనీదత్, రమేష్ ప్రసాద్, మణిశర్మ, ఆహుతి ప్రసాద్, డా.కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ...సన్మానం అని ముందే తెలిసి ఉంటే వచ్చే వాడినే కాదు. ఆడియో రిలీజ్ అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చారు అని అన్నారు. ఇక సంగీతం గురించి మాట్లాడుతూ...'నా దృష్టిలో పాట అంటే ఆ పాటలా మరొకటి ఉండకూడదు. అలా ఉంటే..మెక్ డొనాల్డ్స్, పాపడ్స్ లాంటిదే అవుతుంది. ఒరిజినల్‌వి కావు. ఇప్పటి దర్శకులు అలాంటి పాటలు, ఇలాంటి పాటలు కావాలని అడుగుతుంటారు. కానీ అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇమిటేషన్ చేయడం నచ్చుదు. కానీ ఇన్స్పిరేషన్ పొందడం ఇష్టం.' అని తెలిపారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..


ఈ చిత్రానికి సంగీతం అందించారు అనడకం కన్నా...ఆయన సంగీతం అందించడానికి ఒప్పుకున్నారు అనడమే సమంజసం. ఇళయరాజాగారి ప్రేరణే నన్ను ముందుకు నడిపించింది. మ్యూజిక్ లెజెండ్‌తో కలిసి పని చేయడంతో నా జన్మధన్యమైంది అన్నారు.

ప్రముఖుల హాజరు

ప్రముఖుల హాజరు


ఈ ఆడియో వేడుక కార్యక్రమానికి కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కె.ఎల్.నారాయణ, ఏడిద నాగేశ్వరరావు, అశ్వినీ దత్, రమేష్ ప్రసాద్, మణిశర్మ, ఆహుతి ప్రసాద్, డా. వెంకటేశ్వరరావు.

సాల్ట్ అండ్ పెప్పర్ ఆధారంగా...

సాల్ట్ అండ్ పెప్పర్ ఆధారంగా...


మలయాళంలో హిట్టయిన ‘సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం ఆధారంగా దీనిని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్' బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

నటీనటులు

నటీనటులు


ప్రకాష్‌రాజ్‌, స్నేహ, తేజస్, సంయుక్త, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నవ, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి సంగీతం : మేస్ట్రో ఇళయరాజా, సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్, ఆర్ట్ : కదిర్, ఎడిటింగ్ : జో.ని.హర్ష, సమర్పణ : కె.ఎస్.రామారావు, నిర్మాత : వల్లభ, దర్శకత్వం : ప్రకాష్‌రాజ్‌.

English summary
Ulavacharu Biryani Movie Audio Launch event held at Hyderabad. Prakash Raj, Sneha, Ilayaraja, D.Ramanaidu, K.Raghavendra Rao, MM Keeravani, Mani Sharma, Samyuktha Hornad, KS Rama Rao, Suresh Kondeti, Srivalli Keeravani, Pony Verma graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu