»   » రిలీజ్ డేట్ ఇచ్చారు సరే...క్రేజ్ ఏది?

రిలీజ్ డేట్ ఇచ్చారు సరే...క్రేజ్ ఏది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు,దర్శకుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో సున్నితమైన భావోద్వేగాలు గల కథలను ఎన్నుకుంటూ డైరక్టర్ గా ప్రూవ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆయన డైరక్ట్ చేసిన రెండు చిత్రాలలో ఏదీ విజయం సాధించలేదు. ఆయన దర్శకత్వం బాగానే ఉంది అని క్రిటికల్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించటం లేదు. ఈ సారి 'ఉలవచారు బిర్యాని' చిత్రంతో ఆయన మన ముందుకు వస్తున్నారు. జౌన్ 6 అంటూ రిలీజ్ డేట్ సైతం ఎనౌన్స్ చేసేసారు. అయితే ఎక్కడా క్రేజ్ కనపడటం లేదు. పబ్లసిటి ని మరింత గా పెంచాలేమో ప్రకాష్ రాజ్ చూసుకోవాలి. కేవలం ట్విట్టర్ లో,పేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టుకుంటూ కూర్చుంటే సామాన్య జనాలకు రీచ్ కాదు అంటున్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... ప్రేమంటే మావయ్యకు గిట్టదు. మావయ్యకు సరైన జోడీని చూపించి ప్రేమలో దింపాలన్నది అతని మేనల్లుడి ఆలోచన. మావయ్య ఆలోచనలను మేనల్లుడు మార్చగలిగాడా? మావయ్య ప్రేమలో పడ్డాడా? అనేది తెలియాలంటే 'ఉలవచారు బిర్యాని' చూడాల్సిందే అని అంటున్నారు. ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ అధినేత కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. వల్లభ ర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త కీలక పాత్రధారులు.

'Ulavacharu Biryani' release on June 6th

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "సెన్సార్ పూర్తయింది. జూన్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇళయరాజాగారి పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది'' అని అన్నారు. ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నన, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, కెమెరా: ప్రీతా జయరామన్, ఆర్ట్: కదిర్, ఎడిటింగ్: హర్ష, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్.

ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. స్నేహ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మళయాళంలో విజయవంతమైన చిత్రం కావటంతో ఇక్కడా అదే రేంజిని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

English summary
Prakash Raj’s ‘Ulavacharu Biryani’ has been waiting for a release for quite some time now. The film will now release on the 6th of June. This news was confirmed by Prakash himself as he posted on twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu