»   » ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ విడుదల తేదీ ఖరారు

ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న 'ఉలవచారు బిర్యాని' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. తెలుగు, తమిళ మరియు కన్నడ బాషలలో రానున్న ఈ రొమాంటిక్ డ్రామా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారు. మే 1 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించినట్లు సమాచారం.

'ఉలవచారు బిర్యాని' చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన 'సాల్ట్ ఎన్ పెప్పర్' కు రిమేక్. ఈ సినిమాలో స్నేహ మరియు ఊర్వశినటిస్తున్నారు . ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది. మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు.

 'Ulavacharu Biryani' to release on May Day

ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...'ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించబోతున్నాను. మళయాలంలో హిట్టయిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెలుతుంది' అని తెలిపారు. మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు.

English summary
Prakash Raj's latest directorial venture, Ulavacharu Biryani, is now in post-production stage.The movie is slated for May 1st release in all the three languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu