»   » కామ పిశాచి ఉమేష్‌ రెడ్డి... థియోటర్స్ లో హంగామా

కామ పిశాచి ఉమేష్‌ రెడ్డి... థియోటర్స్ లో హంగామా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కామ పిశాచి ఉమేష్‌ రెడ్డి జీవితం ఆధారంగా ఆదిత్య రమేష్‌ మూవీస్‌ పతాకంపై ఆదిత్య రమేష్‌ రూపొందించిన కన్నడ చిత్రం 'ఖతర్నాక్‌' సినిమా ఈరోజు(శుక్రవారం)కర్ణాటక అంతటా విడుదలవుతోంది. ఇందులో రవి కాళె టైటిల్‌ పాత్రను పోషించాడు. బాధిత యువతుల పాత్రల్ని రూపికా, శోభినా పోషించారు. సాధుకోకిలా, బుల్లెట్‌ ప్రకాష్‌, మురళీమోహన్‌, తులసి, రవీంద్రనాథ్‌, తుమకూరు మోహన్‌, శోభా రాఘవేంద్ర ప్రధాన తారాగణం. తొలుత ఈ సినిమాకు ఉమేష్‌ రెడ్డి అనే పేరుపెట్టారు. సాంకేతిక కారణాల వల్ల ఖతర్నాక్‌గా మార్చారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- మళవళ్లి సాయికృష్ణ.

కన్నడ చిత్రపరిశ్రమ లక్కీగా భావించే శుక్రవారం (నేడు) మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానన్నాయి. వివరాలు... బెంగళూరు నగర జీవితం ఇతివృత్తంగా లోటస్‌ సినిమాస్‌, స్టూడియో లైవ్‌ మూవీస్‌ పతాకంపై మహేష్‌ నిర్మాణ సారథ్యలో రూపొందిన కలర్స్‌ ఇన్‌ బెంగళూరు సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా గిరీష్‌ శ్రీవత్సవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Umesh Reddy is now Khatarnak In theaters

దర్శకత్వ బాధ్యతలతో పాటు హీరో గా కూడా నటించాడు. సుప్రియ హీరోయిన్. ఎనిమిది ప్రధాన పాత్రలు, ఆరు సమస్యలతో సినిమా రూపొందినట్లు దర్శకుడు తెలిపాడు. ఇందులో ఐదు పాటలున్నాయి. మైకో మంజునాథ్‌, మిమిక్రీ దయానంద్‌, తృప్తి, ఉపాసనా, తులసి, మంజరి, గౌతమ్‌ ప్రధాన తారాగణం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఇదే కోవలో మంచి అంచనాలతో వస్తున్న మరో చిత్రం 'కాఫీ విత్‌ మై వైఫ్‌'.

నేహా మీడియా పతాకంపై నీలం శంకర్‌ నిర్మించిన 'కాఫీ విత్‌ మై వైఫ్‌' సినిమా నేడు విడుదలవుతోంది. అనీష్‌, సింధు లోకనాథ్‌ జంటగా నటించారు. కుముద, పద్మిని, రిచర్జ్‌ లూయీస్‌ ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. కథ, స్క్రీన్‌ప్లే- మదన్‌, దర్శకత్వం- విద్యాసాగర్‌.

English summary

 Fearing that problems may start in the future, producer Ramesh and director Malavalli Saikrishna has renamed their film 'Umeh Reddy' as 'Khatarnak'.
 Recently the relatives of psychotic killer and dreaded rapist Umesh Reddy had brought stay on the film 'Umesh' which was also based on the life of Umesh Reddy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu